విభజన మాట ఎత్తొద్దు... నేతలను హెచ్చరించిన బీజేపీ..!

ABN , First Publish Date - 2021-06-23T05:22:56+05:30 IST

విభజన మాట ఎత్తొద్దు... నేతలను హెచ్చరించిన బీజేపీ..!

విభజన మాట ఎత్తొద్దు... నేతలను హెచ్చరించిన బీజేపీ..!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను  రెండుగా విభజించాలంటూ ఇటీవల బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కమలనాథులు ఇలాంటి వ్యాఖ్యలు చేయ్యవద్దంటూ తమ నేతలకు హుకుం జారీచేశారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ డిమాండ్ చేయడం పార్టీ నియమావళిని ఉల్లంఘించడం కిందికే వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ అలీపూర్‌దౌర్‌ నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న జాన్ బార్లా, బిష్ణుపూర్ ఎంపీ సౌమిత్రఖాన్ ప్రతిపాదించడంపై తీవ్ర వివాదం రేగిన విషయం తెలిసిందే. ఉత్తర బెంగాల్ జిల్లాలను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనీ.. జంగిల్ మహల్ ప్రాంతంతో పాటు దక్షిణ బెంగాల్లోని ఇతర ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని ఈ ఎంపీలు డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ పార్టీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందించారు. ‘‘రాష్ట్రాన్ని విభజించాలంటూ మా పార్టీకి చెందిన కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగతం. వారి ప్రతిపాదనకు మా పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదు. బెంగాల్‌ను ఏ రూపంలోనూ విభజించే ఉద్దేశం బీజేపీకి లేదు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా ఉండాలనీ.. పార్టీ పరిధి దాటి మాట్లాడితే ఉపేక్షించే ప్రసక్తే లేదు..’’ అని ఘోష్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-23T05:22:56+05:30 IST