Advertisement
Advertisement
Abn logo
Advertisement

చేపల పెంపకంతో లాభాలు

చిలుకూరు, అక్టోబరు 26:  చేపల పెంపకంతో లాభాలు ఆర్జించవచ్చని   సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్రెష్‌ వాటర్‌ ఆక్వాకల్చర్‌ (సీఐఎఫ్‌ఏ) భువనేశ్వర్‌ శాస్త్రవేత్త, చైర్మన్‌ డాక్టర్‌ హెచ్‌.కే.డే అన్నారు. షెడ్యూల్డ్‌ కులాల ఉప ప్రణాళిక కింద మండల పరిషత్‌ కార్యాలయంలో సిఐఎఫ్‌ఏ ఆధ్వర్యంలో  చెన్నారిగూడెం మత్స్య సొసైటీ సభ్యులకు చేపల పెంప కంపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఫ్రభుత్వం అందిస్తున్న పథకాలను మత్స్యకారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల చేపల పెంప కంపై అవగాహన కల్పించారు. అనంతరం కరపత్రాలు, పోస్టర్లను విడు దల చేశారు. కార్యక్రమంలో సీఐఎఫ్‌ఏ శాస్త్రవేత్త డాక్టర్‌ రంగాచార్యులు, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త బి.లవకుమార్‌, జిల్లా మత్స్య సొసైటీ అధికారి సౌజన్య, ఎంపీపీ ప్రశాంతి , ఎంపీడీవో ఈదయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement