Abn logo
Sep 23 2021 @ 23:51PM

సీఎం జగన కోసం సీమ ప్రయోజనాలు తాకట్టు

విలేకరులతో మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి

నేడు సీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై సదస్సు
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి
కడప(ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 23:
ముఖ్యమంత్రి వైఎ్‌స జగన స్వప్రయోజనాల కోసం రాయలసీమ ప్రయోజనాన్ని తాకట్టుపెట్టారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం కడపలోని తన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా జగన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం, టీఆర్‌ఎ్‌సతో వైసీపీ మ్యాచఫిక్సింగ్‌ చేసుకుందని ఆరోపించారు. రాయలసీమలో 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నా ఉలుకుపలుకు లేకుండా ఉన్నారని విమర్శించారు. రెండున్నర సంవత్సరాలుగా వైసీపీ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. నీటి ప్రాజెక్టులపై కేంద్రం గెజిట్‌ను ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాల్లో గెజిట్‌ ఉపసంహరణకు డిమాండ్‌ చేయాలన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై టీడీపీ రాయలసీమ నేతలతో శుక్రవారం నగర శివారులోని మాధవి కన్వెన్షనలో సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు, భవిష్యత కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. టీడీపీ నాయకులు రామ్‌గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.