రైతు ఉత్పత్తి సంఘాలతో ప్రయోజనం

ABN , First Publish Date - 2021-09-19T05:16:49+05:30 IST

రైతు ఉత్పత్తి సంఘాలతో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని బొబ్బిలి జోన్‌ కేన్‌ అసెస్టెంట్‌ కమి షనర్‌ లోకేష్‌, వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌ అన్నారు. సంకిలి ఈఐడీ ప్యారీ సుగర్స్‌లో శనివారం రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పా టుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుగర్స్‌ పరిధిలోని రైతులు ఈ సంఘాల్లో చేరాలని కోరారు.

రైతు ఉత్పత్తి సంఘాలతో ప్రయోజనం
మాట్లాడుతున్న సుగర్‌ కేన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ లోకేష్‌ (


రేగిడి, సెప్టెంబరు 18: రైతు ఉత్పత్తి సంఘాలతో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని బొబ్బిలి జోన్‌ కేన్‌ అసెస్టెంట్‌ కమి షనర్‌ లోకేష్‌, వ్యవసాయశాఖ జేడీ శ్రీధర్‌ అన్నారు. సంకిలి ఈఐడీ ప్యారీ సుగర్స్‌లో శనివారం రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పా టుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుగర్స్‌ పరిధిలోని రైతులు ఈ సంఘాల్లో చేరాలని కోరారు. ఒక్కో సంఘంలో 100 నుంచి 200 మంది రైతులకు సభ్యత్వం ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటుతో పాటు రైతులకు ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 30 సంఘాలను ఏర్పాటు చేశారన్నారు. అనంతరం  యంత్రీకరణ, సాగులో చీడపీడల నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో  సుగర్స్‌ డీజీఎం రమేష్‌రెడ్డి, సీడీఎం అప్పారావు, ఏడీఏ వెంకటరావు, వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

 


 

Updated Date - 2021-09-19T05:16:49+05:30 IST