రైతు బజార్లతో ప్రయోజనం

ABN , First Publish Date - 2020-05-24T09:04:26+05:30 IST

రైతు బజారుల ద్వారా రైతులకు, ప్రజలకు ప్రయోజనక రమని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

రైతు బజార్లతో ప్రయోజనం

అద్దంకి, మే 22: రైతు బజారుల ద్వారా రైతులకు, ప్రజలకు ప్రయోజనక రమని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. అద్దంకి మా ర్కెట్‌ యార్డు ఆవరణలో ఏర్పాటుచేసిన రైతు బజారును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ వినియోగదారుల కు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లు అందించాలన్న ఉద్దేశంతో రైతు బజార్‌ లను ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఏఎంసీ పరిధిలో అద్దంకి, పంగులూరు, మేదరమెట్లలోని యార్డులలో ప్రతిరోజూ రైతు బజార్లు నిర్వహిస్తామన్నారు. పసుపు రైతులకు మార్కెటింగ్‌ సదుపాయాం కల్పించినట్లు చెప్పారు. కార్యక్ర మంలో ఏఎంసీ చైర్మన్‌ భువనేశ్వరి, వైస్‌ చైర్మన్‌ యర్రం రత్నారెడ్డి కార్యదర్శి శ్రీనివాసులు, ఏవో వెంకటకృష్ణ, హెచ్‌వో ఆదిరెడ్డి, మాజీ ఎంపీపీ జ్యోతి హను మంతరావు, కోట శ్రీనివాసకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T09:04:26+05:30 IST