Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘సంపూర్ణ గృహహక్కు’తో ప్రయోజనం

  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

ఎచ్చెర్ల, నవంబరు 25: సంపూర్ణ గృహ హక్కు పథకంతో లబ్ధదారులకు ఎంతో ప్రయోజనం కలగనుందని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. బొంతలకోడూరు, ఫరీద్‌పేట గ్రామాల్లో ఆయన గురువారం పర్యటించారు.   గృహ హక్కు పథకాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ పథకంపై స్థానిక ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. బొంత లకోడూరులో నిలిచిపోయిన సచివాలయ భవనం పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సనపల సుధాసాగర్‌, ఎంపీడీవో పావని, ఈవోపీఆర్డీ కె.ఈశ్వరి, సర్పంచ్‌ పంచిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


ఎల్‌.ఎన్‌.పేట: గ్రామాల్లో ఇళ్ల లబ్ధిదారులు సంపూర్ణ గృహహక్కు పఽథకాన్ని సద్వినియోగం చేసుకోవా లని ఎంపీడీవో కాళీప్రసాదరావు తెలిపారు. మండలంలోని దబ్బపాడు గ్రామంలో గురువారం ప్రచారం నిర్వహించారు. సచివాలయ నోడల్‌ అధికారి ఎంవి. రమణమూ ర్తి, వీఆర్వో శేషగిరి, సచివాలయ కార్యదర్శులు గిరిబాబు, విక్రమ్‌, హౌసింగ్‌ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. 


రాజాం: గృహ హక్కుతో సర్వహక్కులు కలుగుతాయని పాలకొండ ఆర్డీవో కుమార్‌ అన్నారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యన్నారాయణపురం గృహ హక్కు పథకంపై  నిర్వహించిన గ్రామసభలో పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, నగరపాలక సంస్థలో రూ.15 వేలు చెల్లించిన తరువాత లబ్ధిదారుడు రిజిస్ట్రేషన్‌ పత్రం సొంతం చేసుకోవచ్చన్నారు. కమిషనర్‌ నాగరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టరు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement