‘నేరడి’తో జిల్లాకు ప్రయోజనం

ABN , First Publish Date - 2021-04-21T05:14:43+05:30 IST

నేరడి బ్యారేజీతో జిల్లాకు ఎంతో ప్రయోజనం కలగనుందని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. రైతులకు సున్నా వడ్డీ పంపిణీపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌లో మంత్రి అప్పలరాజు మాట్లాడారు.

‘నేరడి’తో జిల్లాకు ప్రయోజనం
రైతులకు సున్నా వడ్డీ చెక్కు అందుజేస్తున్న స్పీకర్‌ సీతారాం, మంత్రి అప్పలరాజు, కలెక్టర్‌ నివాస్‌

 రైతులకు అండగా ప్రభుత్వం
 మంత్రి సీదిరి అప్పలరాజు
 కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 20:
నేరడి బ్యారేజీతో జిల్లాకు ఎంతో ప్రయోజనం కలగనుందని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. రైతులకు సున్నా వడ్డీ పంపిణీపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌లో మంత్రి అప్పలరాజు మాట్లాడారు. ‘నేరడి  ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్‌ ముందడుగు వేయడం అభినందనీయం. ఒడిశా సీఎంతో మాట్లాడి పనులు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలగనుంది. రైతులకు ప్రభుత్వం అం డగా నిలుస్తోంది. పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పెట్టుబడి రాయితీ, తదితర సౌకర్యాలను రైతులకు కల్పిస్తున్నాం. రైతుభరోసా కేంద్రాల్లో ఆధునిక వ్యవసాయ పనిముట్లను అందుబాటులో ఉంచాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కళ్లాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నాం. సున్నా వడ్డీ కింద జిల్లాలో 68,401 మంది రైతుల ఖాతాల్లో రూ.6.04 కోట్లు జమయింది’ అని మంత్రి తెలిపారు. అనంతరం రైతులకు సున్నా వడ్డీ చెక్కులను అందించారు. కార్యక్రమంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే కంబాల జోగులు, కలెక్టర్‌ జె.నివాస్‌, వ్యవసాయ మిషన్‌ బోర్డు డైరెక్టర్‌ గొండు రఘురాం, జేసీ సుమిత్‌కుమార్‌ వ్యవసాయ శాఖ ఉపసంచాలకుడు రాబర్ట్‌పాల్‌, ఏడీ శ్రీనివాసరావు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T05:14:43+05:30 IST