భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-12-04T22:09:56+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. వడ్డీరేట్లను యధాతథంగా ఉంచడంతో పాటు కొంత సర్దుబాటు..

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. వడ్డీరేట్లను యధాతథంగా ఉంచడంతో పాటు ఆర్బీఐ కొంత సర్దుబాటు ధోరణి కనబర్చడంతో దేశీయ సూచీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఫైనాన్షియల్ స్టాక్‌ల దూకుడుతో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 446.90 పాయింట్ల (1 శాతం) లాభంతో 45,079.55 వద్ద క్లోజ్ అయ్యింది. మరోవైపు నిఫ్టీ సైతం 124.60 పాయింట్లు (0.95 శాతం) బలపడి 13,258.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, ఐసిఐసిఐ బ్యాంక్, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ ఫార్మా తదితర షేర్లు లాభాలతో ముగియగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, బిపిసిఎల్, హెచ్‌సిఎల్ టెక్ తదితర షేర్లు నీరసించాయి. 

Updated Date - 2020-12-04T22:09:56+05:30 IST