డిగ్రీ కళాశాలకు బెంచీలు, ఫ్యాన్‌ల వితరణ

ABN , First Publish Date - 2022-07-01T02:54:39+05:30 IST

స్థానిక మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం గూడూరు రోటరీ క్లబ్‌ వారు గురువారం 20 బెంచీలు,

డిగ్రీ కళాశాలకు బెంచీలు, ఫ్యాన్‌ల వితరణ
బెంచీలు, ఫ్యాన్‌లు అందజేస్తున్న క్లబ్‌ సభ్యులు

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 30: స్థానిక మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల సౌకర్యార్థం గూడూరు రోటరీ క్లబ్‌ వారు గురువారం 20 బెంచీలు, 4 సీలింగ్‌ ఫ్యాన్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్‌ పీ.ఈశ్వర్‌కుమార్‌ మాట్లాడుతూ ఉదయగిరికి గూడూరు దూరమైనప్పటికీ రోటరీక్లబ్‌ వారు బెంచీలు, ఫ్యాన్‌లు వితరణ చేయడం అభినందనీయమని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యాభివృద్ధికి రోటరీ క్లబ్‌ ఎప్పుడూ ముంటుందని క్లబ్‌ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు బాలకృష్ణంరాజు, హరేష్‌రెడ్డి, సభ్యులు నాగసునీల్‌, సుధీర్‌, రోటరీ మాజీ గవర్నర్‌ మునిగిరీష్‌, అధ్యాపకులు నాగేంద్రప్రసాద్‌, అన్వర్‌బాషా, పెదనారాయణ, గీత, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T02:54:39+05:30 IST