Abn logo
Oct 25 2021 @ 23:18PM

బెల్టు షాపులు ఎత్తివేయాలి

గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు

నర్వ, అక్టోబరు 25 : మండలంలోని పెద్దకడ్మూర్‌ గ్రామంలో బెల్టు షాపులను ఎత్తి వేసి మద్య నిషేదం పాటించాలని సోమవారం గ్రామంలో మహిళలు పుర వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. సీపీఐఎంఎల్‌ నాయకుడు రామకృష్ణ వారికి మద్దతు ప్రకటించారు. కాగా ఇటీవల వారం రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన మునెప్ప అనే వ్యక్తి తన భార్య మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఉరి వేసి హత్య చేసిన సంఘటన పాఠకులకు విధితమే. ఈ సందర్భంగా మహిళలు గ్రామంలో బెల్టు షాపులు ఉన్నందున మగవారు మద్యానికి బానిసలవుతూ మహిళలను హింసిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే గ్రామంలో మద్యం షాపులు లేకుండా చేయాలని మహిళలు డిమాండ్‌ చేశారు.