12100 దిగువన బలహీనం

ABN , First Publish Date - 2020-02-14T07:09:01+05:30 IST

నిఫ్టీ మైనర్‌ అప్‌ట్రెండ్‌లో ప్రారంభమైనా గరిష్ఠ స్థాయి 12220 వద్ద నిలదొక్కుకోలేకపోయింది. తదుపరి ఏర్పడిన రియాక్షన్‌లో ఇంట్రాడే కరెక్షన్‌లో పడినా చివరిలో స్వల్ప రికవరీతో క్లోజయింది.

12100 దిగువన బలహీనం

నిఫ్టీ మైనర్‌ అప్‌ట్రెండ్‌లో ప్రారంభమైనా గరిష్ఠ స్థాయి 12220 వద్ద నిలదొక్కుకోలేకపోయింది. తదుపరి ఏర్పడిన రియాక్షన్‌లో ఇంట్రాడే కరెక్షన్‌లో పడినా చివరిలో స్వల్ప రికవరీతో క్లోజయింది. మరో సారి కీలకమైన 20, 50 డిఎంఏల వద్ద పరీక్ష ఎదుర్కొంటోం ది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఈ స్థాయిల కన్నా పైన నిలదొక్కుకోవాలి. గత కొద్ది రోజుల్లో బలమైన రికరవరీ సాధించి 600 పాయింట్లకు పైగా లాభపడినందు వల్ల ప్రస్తుత స్థాయిల్లో కన్సాలిడేషన్‌ ఏర్పడవలసి ఉంది. 


శుక్రవారం స్థాయిలివే...

నిరోధం : 12250 మద్దతు : 12100

  • కదలికలు పరిమితంగానే ఉన్నాయి. తదుపరి ఇంట్రాడే నిరోధం 12210. ప్రధాన నిరోధం 12250. ఇదే స్వల్పకాలిక అవరోధం. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ మరింతగా కొనసాగుతుంది. 

  • ప్రధాన మద్దతు స్థాయి 12100. గతంలో ఏర్పడిన ఈ బాటమ్‌ వద్ద విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో పడుతుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.

వి.సుందర్‌ రాజా

Updated Date - 2020-02-14T07:09:01+05:30 IST