Abn logo
Aug 5 2020 @ 04:14AM

బెల్లంపల్లి మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

34 మంది సభ్యుల్లో 29 మంది హాజరు 

టీఆర్‌ఎస్‌కు చెందిన సభ్యుల ఎన్నిక


బెల్లంపల్లి టౌన్‌, ఆగస్టు 4: బెల్లంపల్లి మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక మంగళవారం ఎమ్మెల్యే దు ర్గం చిన్నయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌, చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత సమక్షంలో జరిగాయి. ఈ ఎ న్నికల్లో 34 మంది సభ్యులకుగాను 29 మంది  హాజర య్యారు. ఈనెల 28న నామినేషన్ల ప్రక్రియ ముగియ  గా నాలుగు స్థానాలకు నలుగురు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మంగళవారం నిర్వహించిన మున్సి పల్‌ ప్రత్యేక సమావేశంలో కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్నారు.  కోఆప్షన్‌ సభ్యునిగా ఏలూరి వెంకటేష్‌, ము చ్చర్ల భాగ్యలక్ష్మీ, సుశీల, వాజీద్‌ అలీ సయ్యద్‌లను ఎన్నుకున్నట్లు కమి షనర్‌ ప్రకటించారు. ఎన్నికైన సభ్యు లకు ధ్రువీకరణ పత్రాలు అందజే శారు. వైస్‌చైర్మన్‌ బత్తులసుదర్శన్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement