Abn logo
Sep 20 2020 @ 22:31PM

అలాంటి వారిని ప్రేమిస్తా: బెల్లంకొండ శ్రీనివాస్‌

Kaakateeya

ఇబ్బందుల్లో కూడా ఫేస్‌ మీద చిరునవ్వు కురిపించే వారంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రమ్‌లో చేసిన పోస్ట్ వైరల్‌ అవుతుంది. క్లీన్‌ షేవ్‌లో ఉన్న ఫొటో ఒకటి అలాగే ఫుల్‌గా గడ్డంతో ఉన్న ఫొటో ఒకటి పోస్ట్ చేసిన ఆయన కష్టాలను కూడా చిరునవ్వుతో స్వీకరించిన వారంటే నాకు ఎంతో ఇష్టమని తెలిపారు. కరోనా కారణంగా 2020వ సంవత్సరం ఎలా మారిందో తెలియంది కాదు. ఇటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ముఖంపై చిరునవ్వు చెరగలేదంటే.. ఈ చిరునవ్వు వెనుక గొప్ప కారణం ఉంటుందని, దానిని మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని ఆయన తెలిపారు.

''ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు.. ఎన్నో విషయాలు మారిపోయాయి, కానీ ఎప్పుడూ నా చిరునవ్వు మాత్రం చెరిగిపోలేదు. ఇబ్బందుల్లో ఉండి కూడా చిరునవ్వుతో ఉన్నవారిని నేను ప్రేమిస్తున్నాను.. ఎందుకంటే ఆ చిరునవ్వుకు ఎప్పుడూ కారణం ఉంటుంది. దానిని కనుగొనడం గుర్తుపెట్టుకోండి.." అని బెల్లంకొండ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో 'అల్లుడు అదుర్స్' అనే చిత్రంలో చేస్తున్నారు.


Advertisement
Advertisement