నమ్మించి... నట్టేట ముంచి...

ABN , First Publish Date - 2021-04-11T06:09:46+05:30 IST

సోషల్‌ మీడి యాలో అందమైన అమ్మాయి ఫొటో పంపి అతడితో పరిచయం పెంచుకుంది. అనంతరం యాక్సిడెంట్‌ పేరిట అబద్దమాడి రూ.15 లక్షలకు టోకరా వేసి చివరికి పోలీసులకు చిక్కింది. ఈ సంఘటనపై శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో రూరల్‌ సీఐ బన్సీలాల్‌ వివరాలు వెల్లడించారు.

నమ్మించి... నట్టేట ముంచి...
మీడియాతో మాట్లాడుతున్న రూరల్‌ సీఐ బన్సీలాల్‌

- సోషల్‌ మీడియా ద్వారా పరిచయం 

- రూ.15 లక్షలకు యువతి టోకరా 


వేములవాడరూరల్‌, ఏప్రిల్‌ 10: సోషల్‌ మీడి యాలో అందమైన అమ్మాయి ఫొటో పంపి అతడితో పరిచయం పెంచుకుంది. అనంతరం యాక్సిడెంట్‌ పేరిట అబద్దమాడి  రూ.15 లక్షలకు టోకరా వేసి చివరికి పోలీసులకు చిక్కింది. ఈ సంఘటనపై శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో రూరల్‌ సీఐ బన్సీలాల్‌ వివరాలు వెల్లడించారు. మండలంలోని చెక్కపల్లి గ్రామానికి చెందిన నరెడ్ల గంగారెడ్డి అనే యువకుడు ఉపాధి నిమిత్తం మూడేళ్ల క్రితం దుబాయికి వెళ్లాడు. మధ్యలో స్వగ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో జగిత్యాలకు చెందిన ఓ మహిళ అతడికి ఫోన్‌ చేసి తన పేరు నందుగా పరిచయం చేసుకుంది. తాను హైదరాబాద్‌కు చెందిన అవివాహిత యువతినని పేర్కొంది. అందమైన అమ్మాయి ఫొటోను పంపి ఆమె ఫొటోగా పేర్కొంది. మూడు నెలల అనం తరం వేరే నంబరుతో గొంతుమార్చి తన పేరు వైశు అని తాను నందు స్నేహితురాలినని చెప్పిం ది. నందు హైదరాబాద్‌ నుంచి జగిత్యాల వెళ్తుండగా యాక్సిడెంట్‌ అయి కోమాలోకి వెళ్లిం దని నమ్మించింది. ‘నా ఫోన్‌లో మీ ఇద్దరి ఫొటోలు ఉన్నాయి. డబ్బులు ఇస్తే ఈ విషయం నందు వాళ్ల ఇంట్లో చెప్పను’ అని బెదిరించింది. తనకు పరిచయం ఉన్న ఇటిక్యాల రవి అనే వ్యక్తి అకౌం ట్‌లోకి డబ్బులు పంపమంది. అలా పలుమార్లు ఇటిక్యాల రవి అకౌంట్‌ నంబర్‌లో గంగారెడ్డి దాదాపు రూ.15 లక్షల వరకు జమ చేశాడు. అయినప్పటికీ బెదిరిం పులు ఆగకపోవడంతో గంగారెడ్డి రూరల్‌ పోలీ సులను ఆశ్రయించాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శనివారం సా యంత్రం జగిత్యాలకు చెందిన మహిళను, ఆమెకు సహకరించిన ఇటిక్యాల రవి వేములవాడ కోర్టు శివారు ప్రాంతంలో అరెస్టు చేసి వేముల వాడ రూరల్‌ సర్కిల్‌ ఆఫీస్‌కు తరలించారు.  అనంతరం వారి వద్ద నుంచి రూ.35 వేలు, తులం చైన్‌, మొబైల్‌ ఫోన్‌, బ్యాంకు పాస్‌బుక్‌ స్వాధీనం చేసుకున్నారు.  సమావేశంలో ఎస్సై మాలకొండ రాయుడు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-04-11T06:09:46+05:30 IST