వెంటిలేటర్‌ను త్యాగం చేసి ప్రాణాలను అర్పించిన 90 ఏళ్ల వృద్దురాలు

ABN , First Publish Date - 2020-04-01T03:39:21+05:30 IST

వెంటిలేటర్‌ను వేరొకరికి త్యాగం సుజాన్ హాలెర్ట్స్ అనే 90 ఏళ్ల వృద్దురాలు ప్రాణాలను అర్పించింది. బెల్జియంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుజాన్ మార్చి 20వ తేదీన

వెంటిలేటర్‌ను త్యాగం చేసి ప్రాణాలను అర్పించిన 90 ఏళ్ల వృద్దురాలు

బ్రస్సెల్స్: వెంటిలేటర్‌ను వేరొకరికి త్యాగం సుజాన్ హాలెర్ట్స్ అనే 90 ఏళ్ల వృద్దురాలు ప్రాణాలను అర్పించింది. బెల్జియంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సుజాన్ మార్చి 20వ తేదీన శ్వాస సంబంధింత సమస్యతో ఆసుపత్రిలో చేరింది. అనంతరం ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు తేలింది. కాగా.. తాను ఎంతో మంచి జీవితాన్ని అనుభవించానని.. వెంటిలేటర్‌తో కృత్రిమ శ్వాస తీసుకోవడం తనకు ఇష్టం లేదంటూ సుజాన్ వైద్యులతో చెప్పింది. వెంటిలేటర్‌ను చిన్న వయసు కలిగిన వారికి ఉపయోగిస్తే.. కనీసం వారి ప్రాణాలను కాపాడినట్టు అవుతుందని వైద్యులతో తెలిపింది. ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల తరువాత సుజాన్ మరణించినట్టు వైద్యులు తెలిపారు.


కాగా.. సుజాన్‌ న్యుమోనియా సమస్యతో గతేడాది ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు ఆమె కూతురు జుడిత్ వెల్లడించింది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చినా తన తల్లికి కరోనా ఎలా సోకిందో అర్థం కావడం లేదని చెప్పింది. తన తల్లి ఆసుపత్రిలో చేరే ముందు.. ‘నువ్వు ఏడవకూడదు. నువ్వు నాకు చేయాల్సింది అంతా చేశావు’ అని చెప్పిందని జుడిత్ పేర్కొంది. కనీసం తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం కూడా తనకు దక్కలేదంటూ జుడిత్ కన్నీటి పర్యంతమైంది. కాగా.. సోషల్ మీడియాలో సుజాన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సుజాన్ ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు ప్రార్థిస్తున్నారు.

Updated Date - 2020-04-01T03:39:21+05:30 IST