బెళగావిలో ఆపరేషన్‌ congress

ABN , First Publish Date - 2021-10-19T18:29:50+05:30 IST

రాష్ట్ర రాజకీయ సంచలనాలకు కేంద్రబిందువైన బెళగావిలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసుకునేందుకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ దృష్టి సారించారు. ఈమేరకు జేడీఎస్‌లో ప్రముఖ నాయకుడైన అ

బెళగావిలో ఆపరేషన్‌ congress

- జేడీఎస్‌ నేత పూజారికి గాలం 

- రంగంలోకి దిగిన డీకే శివకుమార్‌


బెంగళూరు(karnataka): రాష్ట్ర రాజకీయ సంచలనాలకు కేంద్రబిందువైన బెళగావిలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసుకునేందుకు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ దృష్టి సారించారు. ఈమేరకు జేడీఎస్‌లో ప్రముఖ నాయకుడైన అశోక్‌పూజారిని కాంగ్రెస్‌ వైపు లాగేందుకు సిద్ధమయ్యారు. బెళగావి జిల్లాలో జార్కిహొళి సోదరులదే హవా కొనసాగుతోంది. ప్రస్తుతం అన్నదమ్ముల్లో ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రమేశ్‌ జార్కిహొళి, బాలచంద్ర జార్కిహొళి బీజేపీలో ఉండగా సతీశ్‌ జార్కిహొళి కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. రమేశ్‌జార్కిహొళి కారణంగానే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం పతనమైన విషయం తెలిసిందే. అంతకు ముందు నుంచే రమేశ్‌జార్కిహొళికి డీకే శివకుమార్‌కు మధ్యన విభేదాలు ఉన్నాయి. ఇద్దరూ కాంగ్రెస్‌లోనే ఉన్నా రమేశ్‌జార్కిహొళికి శత్రువుగా కొనసాగుతున్న ఇదే జిల్లాకు చెందిన లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు మద్దతు ఇవ్వడంతోనే వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. రమేశ్‌జార్కిహొళిని 2023 ఎన్నికలలో ధీటుగా ఎదుర్కొనేందుకు అశోక్‌పూజారిని సిద్ధం చేయాలని డీకే శివకుమార్‌ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పలుమార్లు పూజారితో చర్చలు జరిగాయి. జేడీఎస్‌కు బెళగావిలో ప్రాధాన్యత లేకపోవడంతో పూజారి కూడా మరోపార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. బీజేపీలో వెళ్లే అవకాశం లేనందున కాంగ్రెస్‌ అనివార్యమైంది. అశోక్‌ పూజారి జేడీఎస్‌ను వీడితే జిల్లాలో కాంగ్రె్‌సకు మరింత బలం పెరగడంతోపాటు జేడీఎస్‌ పరిస్థితి అధ్వాన్నం కానుంది. ఇప్పటికే సతీశ్‌జార్కిహొళితో చర్చలు జరపగా తాజాగా డీకే శివకుమార్‌ను కలిశారు. 


Updated Date - 2021-10-19T18:29:50+05:30 IST