బెజవాడ చిన్నారి ప్రపంచ రికార్డు

ABN , First Publish Date - 2021-01-18T09:29:42+05:30 IST

‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న సామెతను బెజవాడకు చెందిన ఐదేళ్ల చిన్నారి అభిజ్ఞ త్రిపురనేని నిజం చేసింది.

బెజవాడ చిన్నారి ప్రపంచ రికార్డు

  • 18.1 సెకన్లలోనే 100 నంబర్ల పై వాల్యూ
  • చాంపియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు


(విజయవాడ-ఆంధ్రజ్యోతి):‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్న సామెతను బెజవాడకు చెందిన ఐదేళ్ల చిన్నారి అభిజ్ఞ త్రిపురనేని నిజం చేసింది. విజయవాడకు చెందిన వైద్యులు శరత్‌చంద్ర, చాముండేశ్వరి దంపతుల కుమార్తె అభిజ్ఞ 100 డెసిమల్‌ నంబర్ల పై వాల్యూ (దశాంశ సంఖ్యల విలువ)ను కేవలం 18.1 సెకన్లలో టకటకా చెప్పేసి చాంపియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. ‘ఫాస్టెస్ట్‌ టు రీకాల్‌ 100 డిజిట్స్‌ ఆఫ్‌ పై వేల్యూ బై ఎ కిడ్‌’ అనే టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో అత్యంత వేగంగా 100 డెసిమల్‌ నంబర్ల పై వాల్యూ చెప్పి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఇదే టాస్క్‌ను 19.4 సెకన్ల వ్యవధిలో చెప్పి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులకెక్కిన అభిజ్ఞ తాజాగా తన రికార్డును తానే బ్రేక్‌ చేసింది. ప్రస్తుతం అభిజ్ఞ నెలకొల్పిన 18.1 సెకన్ల రికార్డును ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సుకు క్లెయిమ్‌ చేయగా.. 2022 సంవత్సరానికి ‘ఫాస్టెస్ట్‌ టు రీకాల్‌ 100 డిజిట్స్‌ ఆఫ్‌ పై వేల్యూ బై ఎ కిడ్‌’ అనే టైటిల్‌ను తమ కుమార్తెకు ఖరారు చేసినట్టు ఆ సంస్థ ప్రతినిధుల నుంచి సమాచారం వచ్చిందని ఆమె తల్లి డాక్టర్‌ చాముండేశ్వరి తెలిపారు.

Updated Date - 2021-01-18T09:29:42+05:30 IST