హైదరాబాద్ మునక వెనుక.. ఆక్రమణలో ఎనిమిది చెరవులు, 254 ఎకరాలు...

ABN , First Publish Date - 2020-10-18T20:22:22+05:30 IST

గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు... హైదరాబాద్ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. కానీ ఈ పరిస్థితికి కారణమేమిటి ? నగర ప్రజలు ఇంత దారుణంగా అవస్థలు ఎదుర్కోవాల్సి రావడానికి ఎవరు బాధ్యులు ? ఇప్పుడు అందరి మెదళ్ళనూ తొలుస్తోన్న ప్రశ్నలివి. దీని వెనుక సవాలక్ష కారణాలున్నాయని వినిపిస్తోంది. వెంచెర్లు వేసి, కోట్లు వెనకేసుకున్న, వెనకేసుకుంటోన్న రాజకీయ నాయకుల వైపే ఈ సందర్భంగా అన్ని వేళ్ళూ చూపిస్తున్నాయి.

హైదరాబాద్ మునక వెనుక.. ఆక్రమణలో ఎనిమిది చెరవులు, 254 ఎకరాలు...

హైదరాబాద్ : గత మూడు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు... హైదరాబాద్ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. కానీ ఈ పరిస్థితికి కారణమేమిటి ? నగర ప్రజలు ఇంత దారుణంగా అవస్థలు ఎదుర్కోవాల్సి రావడానికి ఎవరు బాధ్యులు ? ఇప్పుడు అందరి మెదళ్ళనూ తొలుస్తోన్న ప్రశ్నలివి. దీని వెనుక సవాలక్ష కారణాలున్నాయని వినిపిస్తోంది. వెంచెర్లు వేసి, కోట్లు వెనకేసుకున్న, వెనకేసుకుంటోన్న రాజకీయ నాయకుల వైపే ఈ సందర్భంగా అన్ని వేళ్ళూ చూపిస్తున్నాయి. 


రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి ఏళ్ల తరబడి యంత్రాంగం పట్టించుకోకపోవడంతో... నగరంలోని ఎనిమిది చెరువులు, ఓకుంట కలిపి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకంగా 254 ఎకరాలను ఆక్రమించినట్లు అనధికారిక సమాచారం. ఈ ఆక్రమణలను పలువురు రాజకీయ నాయకులు 165 కాలనీలుగా మార్చివేసి, జనావాసాలుగా సామాన్యులకు అమ్మేశారు. ఈ క్రమంలో... వరద రూపంలో భయంకరమైన ముంపు అనుభవం నగర వాసులను అతలాకుతలం చేసింది. నగరంలో తాజాగా కురిసిన భారీ వర్షాలతో ప్రధానంగా  ఎనిమిది చెరువుల చుట్టూ ఉన్న 165 కాలనీలు ముంపు సమస్యనెదుర్కొంటున్నాయి. ఇక... ఎనిమిదిచెరువులు, వాటి చుట్టూ జరిగిన ఆక్రమణలిలా ఉన్నాయి.


1) జల్‌పల్లి పెద్దచెరువు

... విస్తీర్ణం: 299 ఎకరాలు

... ఆక్రమణ  సుమారు 100 ఎకరాలు 

2) హరిహరపురం కాప్రాయ్‌ చెరువు, (వనస్థలిపురం), 

విస్తీర్ణం... 13 ఎకరాలు, ఆక్రమణ... మూడు ఎకరాలు, 

3) అప్పా చెరువు, 

మొత్తం విస్తీర్ణం... 14 ఎకరాలు

, ఆక్రమణ... 10 ఎకరాలు

 4) బొమ్మలకుంట 

ఆక్రమణ... ఎనిమిది ఎకరాలు,

5) అల్వాల్‌ చినరాయుని చెరువు

... విస్తీర్ణం... 17.25 ఎకరాలు, ఆక్రమణలు... ఐదెకకరాలు,

6). రామంతపూర్‌ పెద్దచెరువు... విస్తీర్ణం... 26 ఎకరాలు... ఆక్రమణ: 13 ఎకరాలు, 

7). మైలార్‌దేవ్‌పల్లి పల్లెచెరువు

, విస్తీర్ణం: 39 ఎకరాలు

,  ఆక్రమణ... 24 ఎకరాలు, 

8) ఉప్పల్‌ నల్లచెరువు...  వైశాల్యం... 120 ఎకరాలు, ఆక్రమణలు... 70 ఎకరాలు, 

9) మేడిపల్లి  చెరువు... విస్తీర్ణం... 22 ఎకరాలు, ఆక్రమణలు... 12 ఎకరాలు

Updated Date - 2020-10-18T20:22:22+05:30 IST