Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ Americans.. రూ.300 కోట్ల భారీ స్కామ్.. వెలుగులోకి సంచలన నిజాలు

twitter-iconwatsapp-iconfb-icon
ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ Americans.. రూ.300 కోట్ల భారీ స్కామ్.. వెలుగులోకి సంచలన నిజాలు

న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా టెక్నాలజీ పరంగా ఎప్పుడూ భారత్ కంటే ముందే ఉంటుంది. అయితే టెక్నాలజీని విరివిగా వాడే అమెరికా పౌరుల జేబులను భారత్‌లోని కొందరు హైటెక్ మోసగాళ్లు గుళ్ల చేస్తున్నారు.  వారి బలహీనతలను ఆసరాగా తీసుకుని.. కోట్లలో దండుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఆపరేషన్ అమెరికన్స్‌కు సంబంధించి పోలీసులు సంచల విషయాలను బయటపెట్టారు. ఈ స్కామ్‌లో అమెరికన్లు ఏకంగా రూ.300 కోట్లు కోల్పోయారిని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..


ఆదాయపన్నశాఖ నుంచి ఫోన్ వస్తే సాధరణంగా అమెరికన్లు భయపడుతుంటారు. చాలా సందర్భాల్లో నిజనిర్ధారణ కూడా చేసుకోకుండానే, హడావిడి పడుతుంటారు. దీన్నే కొందరు భారతీయులు ఆసరగా తీసుకుంటున్నారు. కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి, అందులో పని చేసే వారికి అమెరికన్ స్టైల్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడే విధంగా శిక్షణ కూడా ఇప్పించి ఆదాయపన్ను శాఖ అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆదాయపన్ను కింద ఇంత మొత్తం చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. చెల్లించకుంటే జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో చాలా మంది అమెరిన్లు భయాందోళనలకు గురై.. నిజనిర్ధారణ కూడా చేసుకోకుండానే డబ్బులను అకౌంట్లలో జమ చేస్తున్నారు. తీరా మోసపోయామని గ్రహించి ఘొల్లుమంటున్నారు. 


ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ Americans.. రూ.300 కోట్ల భారీ స్కామ్.. వెలుగులోకి సంచలన నిజాలు

ఇంకొందరు సైబర్ నేరగాళ్లు మరో మార్గంలో అమెరికన్లను నట్టేటముంచేస్తున్నారు. వివిధ మార్గాల్లో అమెరికన్లకు సంబంధించిన మెయిల్, ఫోన్ నెంబర్లను సంపాంచి.. సెక్యూరిటీ వార్నింగ్, ర్యాన్‌సమ్‌వేర్‌ను గుర్తించినట్లు సందేశాలు పంపిస్తున్నారు. వాటిని పరిష్కరించేందుకు ఓ కాంటాక్ట్ నెంబర్‌ను కూడా జత చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు కాంటాక్ట్ నెంబర్ ద్వారా సంప్రదించిన అమెరికన్లను ఢిల్లీ కేంద్రంగా ముంచేస్తున్నారు. మరికొందరేమో.. మైక్రోసాఫ్ట్, అమెజాన్‌ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులుగా ఫోన్ చేస్తూ క్రెడిట్ కార్డు, బ్యాంకు డీటేయిల్స్ వంటి సున్నితమైన సమాచారాన్ని తీసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఈ తతంగం పోలీసుల దృష్టికి వచ్చింది. ఫేక్ కాల్ సెంటర్లను కటడి చేయడానికి చర్యలు కూడా చెపడుతున్నారు. 


ఈ క్రమంలోనే ఓ అధికారి ఈ విషయంపై మాట్లాడుతూ.. రోహిణీ, శాలిమార్ బాగ్, మోతీ నగర్, రాజౌంరీ గార్డెన్, తిలక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఫేక్ కాల్ సెంటర్‌లు ఎక్కువగా ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. చాలా మందిని అరెస్ట్ కూడా చేసినట్లు చెప్పారు. అయితే శ్రమించకుండా డబ్బుసంపాదించాలనే ఉద్దేశంతో ఈ తప్పుడు తోవను ఎంచుకుంటున్నట్లు వెల్లడించారు. ఫేక్ కాల్ సెంటర్లలో పని చేసే ఉద్యోగుకులు తమ తమ ఫర్ఫామెన్స్ బట్టి నిర్వాహకుల నుంచి వేతనంగా నెలకు 50వేల నుంచి 60వేలకు వరకు పొందుతున్నారని తమ విచారణలో తేలిందని చెప్పారు. గతంలో ఉద్యోగాలు చేసిన వారే సొంతంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్న ఉదంతాలను కూడా చూసినట్లు చెప్పారు. దీన్నిపై సీరియస్‌గా పని చేస్తున్నట్లు చెప్పిన ఆ అధికారి.. వీటితో సంబంధం ఉన్న పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాత్రి సమయంలో పని చేసే కాల్ సెంటర్లపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు. అంతేకాకుండా కాల్ సెంటర్ల ద్వారా ఈ కేటుగాళ్లు.. అమెరికన్ల దగ్గర నుంచి సుమారు రూ.300 కోట్ల వరకు కాజేశారని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.