Abn logo
Sep 28 2021 @ 00:56AM

కూరగాయలు కోసం మార్కెట్‌కు వెళ్లిన MBA కుర్రాడు.. రెండ్రోజుల తర్వాత ఏ స్థితిలో కనిపించాడంటే..

కరోనా లాక్‌డౌన్ కారణంగా కాలేజీలకు సెలవు ఉండడంతో ఎంబీఏ చదివే ఆ కుర్రాడు తన సొంతూరికి తిరిగొచ్చేశాడు. ఇంటి వద్దే తన తల్లిదండ్రులతో ఉంటూ చదువుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం సెప్టెంబర్ 25న కూరగాయలు తీసుకొచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లాడు. వెళ్లిన వాడు ఎంతకూ తిరిగి రాలేదు. అసలేం జరిగిందంటే..


బీహార్‌లోని బేగుసరాయ్ నగరంలో అధ్యాపకుడిగా పనిచేసే జయరాం పోధార్ కుమారుడు నితీశ్ కుమార్ రాజస్థాన్‌లో ఉంటూ ఎంబీఏ చదువకునేవాడు. కరోనా కారణంగా కాలీజీ మూతపడడంతో ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి వద్దనే ఉంటూ చదువుకుంటున్నాడు. ఎక్కువగా బయటకు కూడా వెళ్లేవాడు కాదు. అలాంటి నితీశ్ ఒకరోజు కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లాడు. అలా వెళ్లిన వాడు మళ్లీ తిరిగిరాలేదు.


ఎంతసేపు ఎదరుచూసినా రాకపోవడంతో అతని తండ్రి జయరాం పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తరువాత నితీశ్ శవమై తేలాడు. రైల్వే స్టేషన్ వద్ద ఒక మూలలో గుంత ఉంది, అందులో అతని శవం లభ్యమైందని పోలీసులు తెలిపారు. నితీశ్ కుటుంబసభ్యులు అతడిని ఎవరో కిడ్నాప్ చేసి ఆ తరువాత హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  నితీశ్ శవంపై యాసిడ్ పోసి ఆధారాలు లేకుండా చేయడానికి ప్రయత్నించారని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం నితీశ్ హత్య కేసుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రత్యేకంమరిన్ని...