ప్రకృతి సేద్యంపై సర్పంచులకు శిక్షణ ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-25T06:21:55+05:30 IST

ప్రకృతి వ్యవసాయం, పెరటి సాగుపై జిల్లాలోని సర్పంచులకు శుక్రవారం నుంచి ఒక రోజు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి తెలిపారు.

ప్రకృతి సేద్యంపై సర్పంచులకు శిక్షణ ప్రారంభం

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 24: ప్రకృతి వ్యవసాయం, పెరటి సాగుపై జిల్లాలోని సర్పంచులకు శుక్రవారం నుంచి ఒక రోజు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి తెలిపారు. శుక్రవారం కుప్పం, పరిసర మండలాలతో కలిపి 76 మంది సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తనతో పాటు జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పాల్గొన్నట్లు తెలిపారు. శనివారం గంగవరం ఎంపీడీవో కార్యాలయంలో పది మండలాలకు చెందిన 31 మంది సర్పంచులకు, 28న చిత్తూరు ఎంపీడీవో కార్యాలయంలో 67 మంది సర్పంచులకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయా గ్రామాల్లో ప్రకృతి సేద్యంపై అవగాహన, ప్రకృతి  సాగును ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

Updated Date - 2022-06-25T06:21:55+05:30 IST