ఆధునిక కిచెన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-28T17:55:32+05:30 IST

నగరంలోని 18 ప్రభుత్వ ఆస్పత్రులలో 20వేల మంది రోగుల అటెండర్‌లకు రోజుకు మూడు పూటలా అరవై వేల భోజనాలు అందించే ఆధునిక

ఆధునిక కిచెన్‌ ప్రారంభం

నగరంలోని 18 ఆస్పత్రులకు మూడు పూటలా 60వేల భోజనాలు : మంత్రి హరీ‌ష్ రావు 


హైదరాబాద్/నార్సింగ్‌: నగరంలోని 18 ప్రభుత్వ ఆస్పత్రులలో 20వేల మంది రోగుల అటెండర్‌లకు రోజుకు మూడు పూటలా అరవై వేల భోజనాలు అందించే ఆధునిక కిచెన్‌ను ఆరోగ్యశాఖ మంత్రి హరీ్‌షరావు సోమవారం ప్రారంభించారు. గండిపేట మండలం నార్సింగ్‌ గ్రామం(కోకాపేట)లోని హరేరామ హరేకృష్ణ సంస్థ అక్షయపాత్ర ప్రాంగణంలో దాతలు రమేష్‌ అగర్వాల్‌, ప్రదీప్‌ అగర్వాల్‌ సాయంతో ఆధునిక కిచెన్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీ్‌షరావుతోపాటు హరేరామ హరేకృష్ణ ప్రతినిధి సత్యగోస్వామి దాసా, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, బండ్లగూడ మేయర్‌ మహేందర్‌గౌడ్‌, నార్సింగ్‌ మున్సిపల్‌చైర్‌పర్సన్‌ డి. రేఖా, వైస్‌ చైర్మన్‌ వెంకటే్‌షయాదవ్‌, స్థానిక కౌన్సిలర్‌ జి. శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీ్‌షరావు కిచెన్‌ మొత్తం పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే భోజనమిత్ర, మిడ్‌డే మీల్స్‌, ఐదు రూపాయల భోజనం అందిస్తున్న హరేరామ హరేకృష్ణ సంస్థ ఇకపై ఆస్పత్రులకు వచ్చే రోగుల బంధువులకు భోజనం పెడుతుందని అన్నారు. ఇక ఆస్పత్రులలో చికిత్స పొందే రోగులకు డైట్‌ ప్లాన్‌ మారుస్తున్నామని, ప్రతిరోజు వారికి భోజనాలతోపాటు మూడు గుడ్లు, అరటిపండ్లు, పెరుగు ఇస్తున్నామని చెప్పారు. 

Updated Date - 2022-06-28T17:55:32+05:30 IST