ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-26T04:23:00+05:30 IST

జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్ష ప్రశాంతంగా జరిగింది.

ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
ఆమనగల్లులో పరీక్ష రాస్తున్న విద్యార్థులు

(ఆంధ్రజ్యోతి,రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : జిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కరోనా కారణంగా మొదటి సంవత్సర పరీక్షలను ప్రభుత్వం ఆలస్యంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చేనెల 3వ తేదీ వరకు నిర్వహించే పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తొలిరోజు పరీక్షకు 96.11శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 58,963మంది జనరల్‌ విద్యార్థులతోపాటు 2,532 మంది ఒకేషనల్‌ విద్యార్థులు కలిపి మొత్తం 61,495 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టి యర్‌ పరీక్ష రాస్తున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 195 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే మొదటిరోజు 59,105మంది పరీక్షకు హాజరయ్యారు. 2,390మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్‌ విద్యార్థులు 2,025 మంది కాగా, ఒకేషనల్‌ విద్యార్థులు 365 మంది గైర్హాజరైనట్లు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్‌ వెంక్యానాయక్‌ తెలిపారు. 



Updated Date - 2021-10-26T04:23:00+05:30 IST