మునేటికి వరద

ABN , First Publish Date - 2022-08-10T06:23:30+05:30 IST

తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల పెనుగంచిప్రోలు మునేటికి వరదనీరు చేరుకుంటుంది.

మునేటికి వరద
కాజ్‌వే వద్ద వరద ప్రవాహం

 పెనుగంచిప్రోలు : తెలంగాణలో కురిసిన భారీ వర్షాల వల్ల పెనుగంచిప్రోలు మునేటికి వరదనీరు చేరుకుంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మునేటికి నీరు అధికంగా వచ్చింది. సాయంత్రం నుంచి వరద ప్రవాహం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. కాజ్‌వే వద్ద వరదనీరు చూసేందుకు పర్యాటకులు పెద్దయెత్తున తరలివస్తున్నారు. అధికారులు పర్యవేక్షిస్తూ, అప్రమత్తగా వ్యవహరిస్తున్నారు.




Updated Date - 2022-08-10T06:23:30+05:30 IST