వ్యాయామానికి ముందు, తర్వాత?

ABN , First Publish Date - 2020-02-10T06:25:37+05:30 IST

వ్యాయామం చేయాలనే ఇష్టం ఉన్నా కొంతమందికి నిస్సత్తువ ఆవరిస్తుంది. లేదా వ్యాయామం తర్వాత ఒంటి నొప్పులు వేధిస్తాయి. ఈ తిప్పలు తప్పాలంటే వ్యాయామానికి ముందు, తర్వాత కొన్ని ఆహార

వ్యాయామానికి  ముందు, తర్వాత?

వ్యాయామం చేయాలనే ఇష్టం ఉన్నా కొంతమందికి నిస్సత్తువ ఆవరిస్తుంది. లేదా వ్యాయామం తర్వాత ఒంటి నొప్పులు వేధిస్తాయి. ఈ తిప్పలు తప్పాలంటే వ్యాయామానికి ముందు, తర్వాత కొన్ని ఆహార  నియమాలు పాటించాలి. అవేమిటంటే...


  • మెరుగైన వ్యాయామం కోసం తగినంత శక్తి అవసరం. కాబట్టి వ్యాయామానికి ముందు శక్తిని అందించే పిండిపదార్థాలు తీసుకోవాలి. ఇందుకోసం యాపిల్‌, మొక్కజొన్న, బ్రౌన్‌బ్రెడ్‌ విత్‌ పీనట్‌ బటర్‌ లాంటివి తినాలి. 
  • వ్యాయామం చేస్తున్నప్పుడు అలసటకు లోనవకుండా ఉడకబెట్టిన గుడ్డు తెల్లసొన లేదా అరటిపండ్లు  తినవచ్చు.
  • వ్యాయామం తర్వాత కచ్చితంగా మాంసకృత్తులు తీసుకోవాలి. ఇందుకోసం గుడ్డు తెల్లసొన లేదా ఆవిరి మీద ఉడికించిన చికెన్‌, చేప తినాలి. 
  • ప్రొటీన్‌ షేక్‌ అలవాటు ఉన్నవాళ్లు వ్యాయామం పూర్తయిన వెంటనే ప్రొటీన్‌ షేక్‌ ఒకటి తాగితే సరిపోతుంది. 

Updated Date - 2020-02-10T06:25:37+05:30 IST