శాన్‌ఫ్రాన్సిస్కోను కమ్మేసిన దట్టమైన పొగ!

ABN , First Publish Date - 2020-09-13T22:37:01+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దావానలం.. దహించివేస్తోంది. కాలిఫోర్నియాలోని అడవుల్లో ఆగస్ట్‌లో పిడుగులు పడటంతో మంటలు

శాన్‌ఫ్రాన్సిస్కోను కమ్మేసిన దట్టమైన పొగ!

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో దావానలం.. దహించివేస్తోంది. కాలిఫోర్నియాలోని అడవుల్లో ఆగస్ట్‌లో పిడుగులు పడటంతో మంటలు చెలరేగాయి. అవి క్రమంగా కార్చిర్చుగా మారాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలలకు గాలులు తోడవటంతో.. మంటలు నివాస ప్రాంతాలను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో సుమారు 2వేల ఇళ్లు దగ్ధం అవ్వగా.. దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే.. కార్చిచ్చు కారణంగా వెలువడుతున్న దట్టమైన పొగ.. శాన్‌ఫ్రాన్సిస్కో నగరాన్ని పూర్తిగా  కమ్మేసింది. దీంతో శాన్ ఫ్రాన్సిస్కోలో ఆకాశం.. మబ్బులు కమ్ముకున్నట్లు చీకటిగా మారిపోయింది. అంతేకాకుండా వాతావరణం మొత్తం నారింజ రంగులోకి మారిపోయింది. 


Updated Date - 2020-09-13T22:37:01+05:30 IST