రక్తాన్ని శుద్ధిచేసే...

ABN , First Publish Date - 2020-10-12T05:34:21+05:30 IST

ఉదయాన్నే బద్దకంగా నిద్రలేవడం, వ్యాయామం చేసిన తరువాత కూడా అలసటగా ఉండడం అప్పుడప్పుడు కనిపించేదే. యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన బీట్‌రూట్‌ జ్యూస్‌తో శక్తి, ఉత్సాహం వస్తుందని అంటున్నారు డాక్టర్‌ డిక్సా భవసర్‌...

రక్తాన్ని శుద్ధిచేసే...

ఉదయాన్నే బద్దకంగా నిద్రలేవడం, వ్యాయామం చేసిన తరువాత కూడా అలసటగా ఉండడం అప్పుడప్పుడు కనిపించేదే. యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన బీట్‌రూట్‌ జ్యూస్‌తో శక్తి, ఉత్సాహం వస్తుందని అంటున్నారు డాక్టర్‌ డిక్సా భవసర్‌. 


కావలసినవి

బీట్‌రూట్‌- ఒకటి, క్యారెట్‌- ఒకటి, పిడికెడు కొత్తిమీర, దానిమ్మ గింజలు- సగం కప్పు, కరివేపాకు రెమ్మలు- ఏడు లేదా ఎనిమిది, పుదీనా ఆకులు కొన్ని, అల్లం- చిన్నముక్క, నిమ్మకాయ- సగం. 


తయారీ:

వీటన్నిటిని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. తరువాత గ్లాసులో వడబోసి, నిమ్మరసం పిండాలి. 


లాభాలివి

ఈ ఎనర్జీ డ్రింక్‌ జీవక్రియలను మెరుగుపరుస్తుంది. దీనిలోని ఫైటోన్యూట్రియెంట్స్‌ జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ డ్రింక్‌ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఫ్రీరాడికల్స్‌ను తొలగించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఎర్రరక్తణాల సంఖ్యను పెంచుతుంది. దాంతో హీమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. ఈ డ్రింక్‌ తీసుకుంటే తొందరగా ఆకలి వేయదు.

Updated Date - 2020-10-12T05:34:21+05:30 IST