పోలీసుల కస్టడీలో బీర్షాబా నిర్వాహకుడు

ABN , First Publish Date - 2020-07-15T16:15:35+05:30 IST

కామారెడ్డి జిల్లాతో పాటు మరో మూడు జిల్లాలో బీర్షాబా స్కీం సంస్థను నెలకొల్పి పలువురి పెట్టుబడిదారులను సభ్యులు గా చేర్చుకొని కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన బీర్షాబా నిర్వాహకుడిని

పోలీసుల కస్టడీలో బీర్షాబా నిర్వాహకుడు

కామారెడ్డి (ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాతో పాటు మరో మూడు జిల్లాలో బీర్షాబా స్కీం సంస్థను నెలకొల్పి పలువురి పెట్టుబడిదారులను సభ్యులు గా చేర్చుకొని కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన బీర్షాబా నిర్వాహకుడిని కామారెడ్డి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ ముమ్మరం చేసినట్లు సమాచారం. బీర్షాబా సంస్థను ఎత్తేసి పెట్టుబడిదారుల నెత్తిన కుచ్చు టోపి పెట్టి పరారు కావడంతో పోలీసులు నిర్వాహకుడిని వారం కిందట అదుపు లోకి తీసుకొని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే సంస్థలో వేలాది మంది సభ్యుల నుంచి వేలల్లో, లక్షల్లో పెట్టుబడులు పెట్టించి వారికి డబ్బులు తిరిగి ఇవ్వకుండా కోట్లాది రూపాయలతో ఎక్కడ ఉంచాడనే, ఎక్కెడెక్క డ ఆస్తులు కూడబెట్టుకున్నాడనే అనే విషయమై విచారణ జరిపేందుకు నిర్వాహ కుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిసింది.


ఇప్పటికే ఆ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించినట్లు సమా చారం. సంస్థ నిర్వాహకుడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపడంతో అందులో పెట్టిన పెట్టుబడులు తమకు ఎవరు తిరిగి ఇస్తారని బాధితులు పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేసేందుకు సంస్థ నిర్వాహకుడిని కస్టడీలోకి తీసుకొని నగదును స్వాధీనం చేసుకు నేందుకు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీర్షాబా నిర్వాహకుడు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. విలువైన ఆస్తుల డాక్యుమెంట్లతో పాటు నగదును పోలీసులు విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-07-15T16:15:35+05:30 IST