తలగడలో ఏముంది?

ABN , First Publish Date - 2020-02-11T05:30:00+05:30 IST

పడక గది అంటే అందరికీ పరవశమే! ఎందుకంటే పగలంతా ఉండే శబ్దాల హోరు నుంచీ, అలజడి, ఆందోళనల నుంచీ పరిపూర్ణ విముక్తి కలిగించే..

తలగడలో ఏముంది?

పడక గది అంటే అందరికీ పరవశమే! ఎందుకంటే పగలంతా ఉండే శబ్దాల హోరు నుంచీ, అలజడి, ఆందోళనల నుంచీ పరిపూర్ణ విముక్తి కలిగించే మరో ప్రపంచం కదా అది! అయితే హాయిగా తల వాల్చే తలగడలో ఏమేం ఉంటాయో ఎందరికి తెలుసు? తలగడలకు సంబంధించి మాంచెస్టర్‌ యూనివర్సిటీలో జరిగిన ఒక అధ్యయనంలో గగుర్పాటు కలిగించే పలు వాస్తవాలు బయటపడ్డాయి.


నెలల పర్యంతం ఉతకని తలగడలో 16 రకాల ఫంగ్‌సలు తయారవుతాయని  పరిశోధకులు స్పష్టం  చేస్తున్నారు. ఈ ఫంగస్‌ పరిణామంగా శ్వాసకోశాల్లో తీవ్ర స్థాయిలో ఇన్‌ఫెక్షన్లు తలెత్తుతూ ఉంటాయి. వీటివల్ల వాయువాహికలు, శ్వాసకోశాలు దెబ్బ తింటాయి. అంతిమంగా ఇది వ్యాధి నిరోధక శక్తి తగ్గడానికి కారణమవుతుంది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి. పిల్లో కవర్స్‌ ఉతకడంతోనే అంతా శుభ్రమైపోయిందని అందరూ అనుకుంటారు. కానీ, దిండు లోపల అసంఖ్యాకంగా ఫంగస్‌ పెరిగిపోతూ ఉంటుంది. అప్పటికప్పుడు దాని తాలూకు దుష్ఫలితాలేవీ కనిపించకపోయినా, ఒక దశలో శరీరం పలురకాల శ్వాసకోశ వ్యాధులకు నిలయం అవుతుంది. అందుకే ఏడాది లేదా రెండేళ్లకు దిండ్లను పారవేయడం ఎంతో శ్రేయస్కరమని పరిశోధకులు చెబుతున్నారు.

Updated Date - 2020-02-11T05:30:00+05:30 IST