బీఈడీ భారం

ABN , First Publish Date - 2021-03-06T06:22:56+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా 600 పైగా బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో 170 వరకు కళాశాలలు న్నా యి.

బీఈడీ భారం

తగ్గించిన ఫీజులతో నిర్వహణ కష్టమే 

అగమ్యగోచరంగా ఉపాధ్యాయ విద్య

 ప్రభుత్వ నిర్ణయంపై కళాశాలల నిర్వాహకుల లబోదిబో 


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపాధ్యాయ విద్యను అందించాలని ఒకవైపు ఎన్‌సీటీఈ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌) సంస్కరణలు ప్రవేశపెట్టింది. అయితే రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఫీజులను తగ్గించి ఉన్నత విద్యామండలి బీఈడీ కళాశాలలకు షాక్‌ ఇచ్చింది. ఏఎఫ్‌ఆర్‌సీ ప్రకారం బీఈడీ కోర్సుల ఫీజులను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తగ్గించిన ఫీజులతో ఈ నెల 26 నుంచి ఎడ్‌సెట్‌ 2020 కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. 


గుంటూరు(విద్య), మార్చి 5: రాష్ట్ర వ్యాప్తంగా 600 పైగా బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో 170 వరకు కళాశాలలు న్నా యి. గతంలో కౌన్సెలింగ్‌ ఫీజు 13500 , స్పెషల్‌ ఫీజు రూ. 3వేలు వసూలు చేసేవారు. ఏఎఫ్‌ఆర్‌సీ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో అత్యధిక కళాశాలల్లో ఫీజును రూ.10 వేలుగా నిర్ణయించారు. మరికొన్ని కళాశాలలకు రూ.12 వేలు, అతి స్వల్ప కళాశాలలకు రూ.15 వేలు ఫీజులు నిర్ణ యించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకంటే  అద నంగా ఎటువంటి ఫీజులను వసూలు చేయరాదంటూ ఆదే శాలు కూడా జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో కొన్ని కళాశా లల్లో కోర్సులను నిర్వహించడమే భారంగా మారింది.


ఎన్‌సీటీఈ నిబంధనలు అమలు ఎలా..

ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం బీఈడీ కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పీహెచ్‌డీ/నెట్‌/స్లెట్‌ ఉం డాలి. ఎన్‌సీటీఈ  నిబంధనల ప్రకారం ప్రతీ కళా శాలలో ప్రతి 100 మందికి 1+7+3 సిబ్బంది ఉం డాలి. వీరుకాక సహాయ సిబ్బంది ముగ్గురు నుం చి ఐదుగురు వివిధ హోదాల్లో పనిచేయాలి. వీరికి ఎన్‌సీటీఈ నిబంఽధనల ప్రకారం జీతాలు చెల్లించాలి. వర్సిటీ పరిధిలోని అ త్యధిక కళాశాలల్లో 100 మాత్రమే సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రూ.10 వేలు ఫీజు ప్రకారం పూర్తి స్థాయిలో విద్యార్థులున్నా కళాశాలకు(100 సీట్లు భర్తీ అయి తే) రూ.10 లక్షలు మాత్రమే వసూలు అవుతాయి. ఈ మొ త్తం నుంచే వర్సిటీకి ఆఫిలియేషన్‌, ఇతరాత్ర ఫీజులు లక్ష ల్లో చెల్లించాలి. ఎడ్‌సెట్‌లో ద్వారా  మూడో వంతు  సీట్లు కూడా భర్తీ కావడంలేదు.  వర్సిటీకి ఫీజులు, సిబ్బందికి జీతాలు చెల్లించి  కళాశాలలు నిర్వహించడం అంటే కష్ట సాధ్యమని నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. బీఈడీ కోర్సు రెండేళ్ల కాలపరిమితి వల్ల ప్రవేశాలు పొందే విద్యా ర్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బీఈడీ అర్హత లేకున్నా విద్యా శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో  బీఈడీ కోర్సు అవసరం లేకుండా పోయింది. బీఈడీ కళాశాలలకు పెద్ద సంఖ్యలో అనుమతులు ఇచ్చారు. దీంతో ఎడ్‌సెట్‌ రాసే విద్యార్థులు తక్కువగా ఉండటం.. సీట్లు ఎక్కువగా ఉన్నా యి. దీంతో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ కావడం లేదు. 1984 నుంచి  నియమ నిబంధనలు పాటిస్తూ రెగ్యులర్‌గా విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా చూసుకున్న కళాశాలల మనుగడ ప్రశ్నర్థకంగా మారింది. విద్యార్థులు తరగతులకు హాజరు కాకుండానే కొన్ని కళాశాలలు, ఒడిషా, బిహార్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో కొన్ని కళాశాలలు సీట్లు నింపుకుంటున్నాయి.


వర్సిటీ తీరుతో బీఈడీ కోర్సు అబాసుపాలు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు అను సరిస్తున్న విధానాల వల్ల కూడా బీఈడీ కోర్సుల నిర్వహ ణపై ప్రభావం చూపుతోంది. వర్సిటీ పరిధిలో 95 శాతం కళాశాలలు క్లాసులు నిర్వహించకుండానే పరీక్షలకు అను మతిస్తున్నాయి. దీంతో రెగ్యులర్‌గా తరగతులు నిర్వహించే కళాశాల వైపు విద్యార్థులు కన్నెత్తి చూడడం లేదు. అత్యధిక కళాశాలల్లో ఎన్‌సీటీఈ ప్రకారం సౌకర్యాలు ఉండటం లేదు. అయినా వర్సిటీ అధికారులు అనుమతులిస్తున్నారు. రెండేళ్లలో ఒక్కసారి కూడా స్టాఫ్‌ అప్రూవల్‌ నిర్వహించ లేదు. అత్యధిక కళాశాలల్లో తరగతులు నిర్వహించక పోవడంతో రెగ్యులర్‌గా క్లాసులు నిర్వహించే, నిబంధనల ప్రకారం సిబ్బందిని ఏర్పాటు చేసుకునే కళాశాలల నిర్వ హణ కష్టసాధ్యమైంది. ఒడిషా విద్యార్థులతో తరగతులు నిర్వహించే కళాశాలలకు రూ.15 వేలు ఫీజులు కేటాయిం చి, నిబంధనలు పాటించే కళాశాలలకు మాత్రం రూ.10 వేలుగా నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి.  

Updated Date - 2021-03-06T06:22:56+05:30 IST