చాణక్య నీతి: ధనవంతునిగా మారాలంటే మీలో ఈ లక్షణాలు ఉండాల్సిందే..

ABN , First Publish Date - 2022-02-13T12:09:12+05:30 IST

ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన వ్యూహకర్తగా...

చాణక్య నీతి: ధనవంతునిగా మారాలంటే మీలో ఈ లక్షణాలు ఉండాల్సిందే..

ఆచార్య చాణక్య నైపుణ్యం కలిగిన వ్యూహకర్తగా, ఆర్థిక శాస్త్రంలో గొప్ప పండితుడిగా ప్రసిద్ధి చెందాడు. రాజరిక పాఠాలు రూపొందించాడు. ఈయన రచించిన చాణక్య నీతి పుస్తకం జీవితానికి సంబంధించిన పలు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించింది. ఆచార్య చాణక్య.. మతం, సంస్కృతి, న్యాయం, శాంతికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడాడు. డబ్బు సంపాదించడమే జీవిత లక్ష్యం అనుకునేవారి కోసం ఆచార్య చాణక్య తన చాణక్య నీతి పుస్తకంలో.. ధనవంతులు కావడానికి, శ్రీమహా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సంబంధించిన విషయాల గురించి వివరించారు. దీని గురించి తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు ఒక శ్లోకంలో ఒక వ్యక్తి జీవితంలో ధనవంతుడు కావడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడు. వ్యక్తి డబ్బును పొదుపు చేయాలి. 


అయితే ఆ డబ్బును ఎలా పొదుపు చేయాలో అతనికి తెలిసివుండాలి. ఒక వ్యక్తి డబ్బును సరిగ్గా ఉపయోగించలేకపోతే, అది అతని పేదరికానికి కారణం అవుతుంది. చెరువులోని నీరు ఒకే చోట నిలిచినట్లే, డబ్బును ఒకే చోట ఉంచడం వల్ల కూడా ప్రయోజనం ఉండదు. అంతే కాదు చాణక్యుడు  తెలిపిన వివరాల ప్రకారం డబ్బు తీసుకునే విషయంలో ఏ వ్యక్తి కూడా సిగ్గుపడకూడదు. ఒక వ్యక్తి డబ్బును అంగీకరించడానికి సిగ్గుపడితే అతను తన సొంత సంపాదనను కూడా కోల్పోతాడు. దీనితో పాటు అతను వ్యాపారంలో భారీ నష్టాలను ఎదుర్కొంటాడు, ఇది వ్యక్తిని క్రమంగా పేదవానిగా మారుస్తుంది. అందుకే డబ్బు విషయంలో ప్రతీఒక్కరూ స్పష్టమైన వైఖరిని కలిగి ఉండాలి. చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి డబ్బు విషయంలో అహంభావంతో ఉండకూడదు. అయితే డబ్బుపై అత్యాశ కలిగి,  దాని కోసం ఎంతకైనా దిగజారేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. అలాంటివారు జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. డబ్బు డబ్బు సంపాదించడానికి ఎవరూ కూడా తప్పుడు మార్గాన్ని ఎన్నుకోకూడదు.


Updated Date - 2022-02-13T12:09:12+05:30 IST