పర్యావరణ ప్రేమికులుగా మారాలి!

ABN , First Publish Date - 2022-06-05T07:39:00+05:30 IST

పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చెట్లను పెంచాలి. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్‌ని దూరం పెట్టాలి.

పర్యావరణ ప్రేమికులుగా మారాలి!

పర్యావరణాన్ని కాపాడుకోవాలి. చెట్లను పెంచాలి. కాలుష్యానికి కారణమయ్యే ప్లాస్టిక్‌ని దూరం పెట్టాలి. కాలుష్యం వల్ల ప్రకృతికి ఎదురవుతున్న ముప్పు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందుకోసం ఏటా జూన్‌5 న పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నాం.

ఐక్యరాజ్యసమితి 1974లో మొదటిసారి పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించింది. ‘ఉన్నది ఒక్కటే భూమి’ అనే థీమ్‌తో ఆ రోజు వేడుకలు జరుపుకొన్నారు. అప్పటి నుంచి ఏటా జూన్‌5న పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నాం.

నాసా అంచనా ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2100 సంవత్సరం కల్లా అడవులు కనిపించకుండా పోతాయట.

2070 నాటికి వరల్డ్‌ కోరల్‌ రీఫ్‌లు సైతం మాయమైపోతాయట.

2050 నాటికి సముద్ర జలాల్లో చేపల కన్నా ప్లాస్టిక్‌ వ్యర్థాలే ఎక్కువ కనిపిస్తాయట.

ప్రతీ ఏటా అభయారణ్యాల్లో ఉంటున్న 50 వేల రకాల జీవులు అంతరించిపోతున్నాయట. అంటే రోజుకి 137 రకాల జంతుజాలం కనిపించకుండా పోతోంది. 

Updated Date - 2022-06-05T07:39:00+05:30 IST