ముఖ్యమంత్రి వల్లే వికారాబాద్‌కు అన్యాయం

ABN , First Publish Date - 2022-08-16T05:54:07+05:30 IST

ముఖ్యమంత్రి వల్లే వికారాబాద్‌కు అన్యాయం

ముఖ్యమంత్రి వల్లే వికారాబాద్‌కు అన్యాయం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌, ఆగస్టు 15: వికారాబాద్‌ ప్రాంతానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర నష్టం చేస్తున్నారని మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సోమవారం తన ని వాసంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇంతకు ముందు రెండుసార్లు జిల్లాకు వచ్చిన క్రమంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. చేవెళ్ల-ప్రాణహితను వికారాబాద్‌కు రాకుండా డిజైన్‌ మార్చి తన ఫాంహౌ్‌సకు, కొడుకు, అల్లుడి నియోజకవర్గాలకు మళ్లించారన్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ కోసం రూ.7కోట్లతో సర్వే చేసిన దాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి నీరు రాకుండా చేశారన్నారు. ఎమ్మెల్యే ఆనంద్‌ ఏ పనులూ చేయడం లేదని, ఆయనకు డాక్టర్‌ వృత్తి తప్ప అభివృద్ధి తెలియదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతీయ జెండాపైనా జీఎస్టీ విధిస్తే ఉత్సవాలు ఎలా నిర్వహిస్తామని ప్రశ్నించారు. వికారాబాద్‌ శాటిలైట్‌ టౌన్‌పై కేసీఆర్‌ స్పష్టతివ్వాలన్నారు. పట్టణాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఉదయం 7.30కే గాంధీ పార్కులో జెండా ఎగరవేయడం ఏమిటని ప్రశ్నించారు.

Updated Date - 2022-08-16T05:54:07+05:30 IST