బీకేర్‌ఫుల్‌ ఫేక్‌ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌

ABN , First Publish Date - 2021-05-08T05:46:31+05:30 IST

ప్రపంచం అంతా కొవిడ్‌ విపత్కర పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ మోసాలు ఆగడం లేదు.

బీకేర్‌ఫుల్‌ ఫేక్‌ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌

ప్రపంచం అంతా కొవిడ్‌ విపత్కర పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ మోసాలు ఆగడం లేదు.  కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ విషయంలోనూ కేవలం ఎస్‌ఎంఎస్‌ పంపి మోసం చేస్తున్న సంఘటనలు బయటకు వస్తున్నాయి. 18 వయస్సు దాటిన వారందరూ వ్యాక్సినేషన్‌ కోసం కొవిన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవచ్చని ప్రభుత్వం తెలపడంతో మోసకారులకు ఈ వార్త అవకాశంగా మారింది. ఇదే అదునుగా న్యూమాల్వేర్‌తో ఆండ్రాయిడ్‌ వినియోగదారులను టార్గెట్‌ చేస్తున్నారని ‘బిజినెస్‌ ఇన్‌సైడర్‌’ ఒక నివేదికలో తెలియజేసింది. పద్ధతిగా రిజిస్ట్రేషన్‌కు బదులు ఫేక్‌ ఎస్‌ఎంఎ్‌సతో మాల్వేర్‌ను పంపుతున్నారు.


ఫ్రీ కొవిడ్‌ వాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ అంటూ ప్రభుత్వ యాప్‌ను అనుకరిస్తున్నారు. ఈ మాల్వేర్‌తో యూజర్‌ డేటాను యాక్సెస్‌ చేసుకుంటున్నారు. డ్యూయల్‌ సిమ్‌ కనెక్టివిటీని కూడా ఇది సపోర్ట్‌ చేస్తోంది. అందుకే అనవసరమైన వెబ్‌సైట్లు, యాప్స్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోకుండా ప్రభుత్వానికి చెందిన ‘కొవిన్‌’ పోర్టల్‌, ‘ఆరోగ్యసేతు’, ‘ఉమాంగ్‌’ యాప్‌ల సహకారంతోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-05-08T05:46:31+05:30 IST