అతను బంధువుల్లోని ఒక మహిళపై కన్నేశాడు.. ఆమెతో శారీరక సుఖం పొందాలనుకున్నాడు.. అందుకని ఆమె భర్తతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు.. దూరపు చుట్టాన్ని అంటూ ఆ మహిళకు దగ్గరయ్యాడు.. ఆ మహిళ కూడా అతనితో బాగానే మాట్లాడేది.. దానిని అనువుగా తీసుకున్న ఆ వ్యక్తి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. తన బలగాన్ని చూపించి బెదిరించాడు.. అతని వేధింపులు ఎక్కువ కావడంతో మహిళ పోలీసులను ఆశ్రయించింది.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలోని ఓ గ్రామంలో బాధిత మహిళ తన భర్తతో కలిసి నివసిస్తోంది. వారికి కొన్ని రోజుల కిందట బంధువుల్లోని ఓ యువకుడు దగ్గరయ్యాడు. బాధిత మహిళ భర్తతో కలిసి తరచుగా ఇంటికి వెళ్లేవాడు. బాధిత మహిళతో చనువుగా ప్రవర్తించేవాడు. బంధువు అనే కారణంతో ఆమె అతడిని అనుమానించలేదు. ఇంటికి వెళ్లినప్పుడల్లా ఆమెకు బహుమతులు ఇచ్చేవాడు. ఇటీవల భర్త ఇంట్లో లేనపుడు అతను ఆమె ఇంటికి వెళ్లాడు. నిన్ను ప్రేమిస్తున్నానని, తనతో శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతపెట్టాడు.
బాధిత మహిళ అంగీకరించకపోవడంతో అదే రోజు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికైనా చెబితే నీ భర్తను చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధిత మహిళ తన భర్తకు ఏమీ చెప్పలేదు. దానిని అలుసుగా తీసుకుని నిందితుడు వేధింపులకు గురి చేస్తుండడంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.