ఆ నూనెలతో అందం

ABN , First Publish Date - 2022-08-04T05:39:16+05:30 IST

ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ అందించే ఫలితాలను బట్టి వేర్వేరు ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను ఉపయోగించుకోవాలి...

ఆ నూనెలతో అందం

ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ అందించే ఫలితాలను బట్టి వేర్వేరు ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను ఉపయోగించుకోవాలి. చర్మం మీద ముడతలు, మచ్చలు, మృత కణాలు... ఇలా సమస్యను బట్టి ఎంచుకోవడానికి ఎన్నో ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉన్నాయి. 


నిమ్మ నూనె: నిమ్మ నూనె వ్యాధికారక క్రిములను తరిమికొడుతుంది. తాజాదనానికి, పరిశుభ్రతకు ఈ వాసనే చిరునామా. కాబట్టే ఇల్లు శుభ్రపరిచే సాధనాలు, సబ్బుల తయారీలో ఈ నూనెను విరివిగా వాడతారు. నిమ్మనూనెలో ‘డి-లిమోనిని’ అనే మూలకం ఉంటుంది. ఇది చర్మం మీద ముడతలు తొలగించి, రక్తప్రసరణను మెరుగుపరిచి, చర్మాన్ని తేటగా మారుస్తుంది. తాజా పరిశోధనల్లో నిమ్మనూనెలో ఉండే డి-లిమోనిని అనే రసాయనం పాడయిన చర్మాన్ని బాగుచేయడంతోపాటు, పలురకాల చర్మ వ్యాధుల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తుందని తేలింది. నిమ్మవాసన మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుంది.


లావెండర్‌: ఈ నూనె సున్నితమైనది. చర్మం మీద మచ్చలను తొలగించి చర్మం వెలిగిపోయేలా చేస్తుంది. సూర్యరశ్మి ప్రభావంతో చర్మం కమిలిపోవడం లాంటి సమస్యలకూ ఇది విరుగుడు. 


క్లేరీ సేజ్‌: వంకాయ రంగు పువ్వులుండే ఒక రకం తులసి మొక్క ఇది. బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడే గుణం దీనికి ఉంది. పలు రకాల వ్యాధికారక క్రిములతో కూడా పోరాడగలదు. చర్మ సమస్యలను తొలగించి, చర్మపు పైపొరలకు రక్తప్రసరణను పెంచే సామర్ధ్యం దీనికి ఉంటుంది.

Updated Date - 2022-08-04T05:39:16+05:30 IST