Advertisement
Advertisement
Abn logo
Advertisement

సొరకాయ జ్యూస్‌తో సౌందర్యం

సొరకాయను జ్యూస్‌ రూపంలో తీసుకోవడం వల్ల అనేక సౌందర్యప్రయోజనాలున్నాయి. అవేమిటంటే...


రోజూ ఉదయాన్నే సొరకాయ జ్యూస్‌ తాగితే ముఖంలో సహజసిద్ధమైన మెరుపు వస్తుంది. ముఖం కాంతిమంతంగా మారుతుంది.

సొరకాయ జ్యూస్‌ జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. ముఖంపై ఉత్పత్తి అయ్యే నూనెను నియంత్రణలో ఉంచుతుంది.

రోజూ ఉదయం ఒక గ్లాసు సొరకాయ జ్యూస్‌ తాగడం అలవాటు చేసుకుంటే వయసుపైబడిన లక్షణాలు దరిచేరకుండా ఉంటాయి. చర్మంపై ముడతలు దూరమవుతాయి.

బట్టతల వస్తున్నట్లయితే సొరకాయ జ్యూస్‌ తాగడం అలవాటు చేసుకోండి. మంచి ఫలితం కనిపిస్తుంది.

జుట్టు నెరుస్తున్నట్లయితే ఈ జ్యూస్‌ తాగండి. ఇది జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది.

ఈ జ్యూస్‌ రక్తాన్ని శుభ్రపరుస్తుంది. శరీరంలో వాపును తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

సొరకాయను చక్రాల్లా తరిగి కళ్లపై పెట్టుకుంటే కళ్లకు రిలీఫ్‌ లభిస్తుంది.

చర్మం మృదువుగా తయారయ్యేందుకు సొరకాయ జ్యూస్‌ సహాయపడుతుంది. ఒకవేళ జ్యూస్‌ తాగలేకపోతే సొరకాయను పేస్టుగా చేసి అందులో శనగపిండి, పెరుగు కలిపి ఫేస్‌ప్యాక్‌గా వేసుకున్నా ఫలితం ఉంటుంది.


Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...