Abn logo
Nov 30 2020 @ 03:30AM

అందాల వేదిక

దక్షిణాది చిత్రాల్లో కథానాయికగా మెరిసింది వేదిక. అభిమానులను మైమరపించిన అందాల వేదిక ఇప్పుడు మాల్దీవుల్లో ఆనందాల వేడుక చేసుకుంటోంది. ఆ ఆనందాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తెలుగులో ‘కాంచన 3’ చిత్రంలో కథానాయికగా మెరిసిన ఈ బామ ఇటీవల మాల్దీవుల విహారయాత్రకు వెళ్లారు. ఆ ఫొటోలు నెట్‌లో వైరలయ్యాయి. ‘‘స్వతంత్రం, ఏదీ అడగదు, ఏదీ ఆశించదు, దేనిపైనా ఆధారపడదు. వర్షంలో ఉండే ప్రశాంతత, కలువ కొలనులో మరింత అందంగా ఉంటుంది. ప్రతి రోజూ ఓ కొత్త సాహసం, మీ కలలు మీరు చేరుకోగల దూరంలో ఉన్నాయి’’ అని ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement