అరటిపండుతో అందంగా

ABN , First Publish Date - 2022-06-29T09:36:39+05:30 IST

పొడి చర్మం ఉండేవాళ్లకి ఈ ఫేస్‌ప్యాక్‌ సరిపోతుంది. సగం అరటిపండును చూర్ణం చేసి దానికి టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి తిరిగి మెత్తగా చూర్ణం చేయాలి.

అరటిపండుతో అందంగా

ఆహారంగా తీసుకుంటే తక్షణమే శక్తినిచ్చే అరటిపండు.. అందాన్ని మెరుగు పర్చడానికి కూడా ఉపయోగపడుతుంది. పొడిచర్మం ఉండే వాళ్లు అరటిపండుతో ఫేస్‌ ప్యాక్స్‌ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 


పొడి చర్మం ఉండేవాళ్లకి ఈ ఫేస్‌ప్యాక్‌ సరిపోతుంది. సగం అరటిపండును చూర్ణం చేసి దానికి టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి తిరిగి మెత్తగా చూర్ణం చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిముషాల తర్వాత కడిగేయాలి. 

ఆయిలీ స్కిన్‌ ఉండే వాళ్లు ఈ ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. ముందుగా అరటిపండు గుజ్జు, కీరదోసకాయ, బొప్పాయి గుజ్జును కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మంపై పిగ్నెంటేషన్‌ పోతుంది. జిడ్డు నుంచి ఉపశమనం లభించి రీఫ్రె్‌షగా తయారవుతారు. 

సగం అరటిపండును ఒక బౌల్‌లో తీసుకోవాలి. దీనికి టేబుల్‌ స్పూన్‌ వేపాకు పేస్ట్‌, టేబుల్‌ స్పూన్‌ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్‌ప్యాక్‌ వేసుకుని అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే చర్మంపై ఉండే నొప్పులు తొలగిపోతాయి.   

Updated Date - 2022-06-29T09:36:39+05:30 IST