రమణీయం.. సీతారామ కల్యాణం

ABN , First Publish Date - 2021-02-25T05:25:21+05:30 IST

మండల పరిధిలోని సి.గోపులాపురంలో పరివార దేవతా పట్టాభిరామస్వామి వారి మూడో వార్షికోత్సవ సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

రమణీయం.. సీతారామ కల్యాణం
బండలాగుడు పోటీలు ప్రారంభిస్తున్న దృశ్యం

కమలాపురం(రూరల్‌), ఫిబ్రవరి 24: మండల పరిధిలోని సి.గోపులాపురంలో పరివార దేవతా పట్టాభిరామస్వామి వారి మూడో వార్షికోత్సవ సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచామృతాభిషేకం, కుంకుమార్చన, శాంతి హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులచే సీతారామ కల్యాణం ఆచార సంప్రదాయాల ప్రకారం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రమణీయంగా సాగింది. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం ఉత్సవమూర్తుల గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి యర్రగుంట్ల వారిచే నిర్వహించిన భజన కార్యక్రమం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా పాలపండ్ల ఎద్దులకు నిర్వహించిన బండలాగుడు పోటీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వా, నేనా అన్న విధంగా జరిగాయి. ఇందులో విజేతలకు మొదటి బహుమతిగా రూ.20,116, రెండవ రూ.15,116, మూడవ రూ.10,116, నాలుగవ రూ.8116, ఐదవ రూ.5116, ఆరవ బహుమతిగా రూ.3116ను దాతలు అందజేశారు.

Updated Date - 2021-02-25T05:25:21+05:30 IST