నందనవనం.. చింతకుంట తండా

ABN , First Publish Date - 2021-04-24T05:00:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ప్రకృతి వనాలను పెంచాలని

నందనవనం.. చింతకుంట తండా
సుందరంగా చింతకుంట తండా ప్రకృతి వనం

  • కనువిందు చే స్తున్న పూలు, పండ్ల మొక్కలు
  • ఆహ్లాదాన్ని కలిగిస్తున్న పల్లెప్రకృతి వనం


చౌదరిగూడ: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ప్రకృతి వనాలను పెంచాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా చౌదరిగూడ మండలంలోని ప్రతీ గ్రామంలో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి మొక్కలు నాటారు. అదే విధంగా మండలంలోని చింతకుంట తండాలోనూ ప్రకృతి వనంలో నాటిన మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. సర్పంచ్‌ హరినాయక్‌ సొంత డబ్బులు వెచ్చించి షాద్‌నగర్‌ నర్సరీల నుంచి జామ, దానిమ్మ, అరటి వంటి పండ్ల మొక్కలు, మందార, గులాబీ, మల్లె, లిల్లీ, తులసి వంటి పూల మొక్కలను తెచ్చి నాటారు. క్రమ పద్ధతిలో మొక్కలను నాటడంతో రోడ్డుకు దగ్గర ఉండటం అటు నుంచి వెళ్లే వారిని ఈ పల్లె ప్రకృతి వనం ఆకట్టుకుంటోంది. ప్ర యాణికులు ఆగి ఇక్కడ ఫొటోలు తీసుకుంటున్నారని సర్పంచ్‌ తెలిపారు. వేసవి తాపంతో కొందరు ప్రయాణికులు లోపలికి వచ్చి కొద్దిసేపు కూర్చుని వెళుతున్నారు. పలు గ్రామాల ప్రజలు సైతం సర్పంచ్‌ కృషిని అభినందిస్తున్నారు. చింతకుంటతండా ప్రకృతివనం ఓ నందన వనంలా గ్రామానికి కొత్త అందాన్ని తెచ్చింది.


ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం

పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచే దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. పంచా యతీ సిబ్బంది, గ్రామస్థులం కష్టించి అందనమైన  ప్రకృతి వనంగా దిద్దాం. రోడ్డుకు పక్కనే ఉండడంతో వాహనదారులు ఇక్కడ ఆగి ఫొటోలు దిగుతున్నారు. పూలు, పండ్ల మొక్కలు ఎక్కువ పెంచుతున్నాం.  

- ఎస్‌.హరినాయక్‌, సర్పంచ్‌, చింతకుంట తండా



Updated Date - 2021-04-24T05:00:32+05:30 IST