Abn logo
Sep 27 2021 @ 00:16AM

అందమైన భామలు...తళుకుబెళుకు తారలు

పోటీల్లో పాల్గొన్న భామలు

మిస్‌ వైజాగ్‌ పోటీల్లో యువతులు అందాల ఆరబోత

తొలి రోజు ర్యాంప్‌ వాక్‌, వాక్‌ రౌండ్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 26: విశాఖ సాగరతీరంలోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగి ‘ఫాబిట్‌ మిస్‌ వైజాగ్‌’ పోటీల్లో  యువతులు తమ తళుకుబెళుకులతో అందాలు ఆరబోశారు. పరిచయ రౌండ్‌ పూర్తయ్యాక నిర్వాహకులు ర్యాంప్‌వాక్‌, వాక్‌రౌండ్‌లు నిర్వహించారు. మొత్తం 22 మంది ఔత్సాహిక యువతులు తమదైన ఆహార్యం, డ్రెస్సింగ్‌ స్టైల్‌తో హోయలొలికిస్తూ ఆహూతులను ఆకట్టుకున్నారు. పోటీల నిర్వాహకుడు అజయ్‌ అగర్వాల్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ టైటిల్‌ విజేత న్యాయ నిర్ణేతలుగా డాక్టర్‌ పి.సునీత, డాక్టర్‌ నల్లి రమ్య, ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ బి.కె.అగర్వాల్‌ వ్యవహరిస్తారని తెలిపారు. అందం, ఆహార్యమే కాకుండా ఇతర అంశాల్లో యువతుల ప్రతిభాసామర్థ్యాలను పరిశీలించాక విజేతలను ప్రకటిస్తారని తెలిపారు.