హైదరాబాద్ సిటీ/మాదాపూర్ : డార్జిలింగ్ నుంచి భాగ్యనగరానికి వచ్చి మాదాపూర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ ఇన్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. డార్జిలింగ్‌కు చెందిన ఒంగ్‌మిట్స్ లెప్చా భర్తకు నగరంలో ఉద్యోగం రావడంతో కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చింది. విభేదాల కారణంగా రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. బ్యూటీషియన్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. భర్తతో గొడవలు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.