బీటీ రోడ్డు నిర్మాణం ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-08-13T05:28:31+05:30 IST

మాడ్గుల మండలం నల్లవారిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు

బీటీ రోడ్డు నిర్మాణం ఎప్పుడో?
నల్లవారిపల్లి రోడ్డు దుస్థితి

  • నరకప్రాయంగా నల్లవారిపల్లి రోడ్డు 

ఆమనగల్లు, ఆగస్టు 12 : మాడ్గుల మండలం నల్లవారిపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం ప్రతిపాదనల్లోనే నిలిచింది. పాలక ప్రజాప్రతినిధుల, నేతల, అధికారుల హామీలకే పరిమితమైంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న మట్టి రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు చాలా చోట్ల గోతులేర్పడి, బురదమయంగా మారింది. నిత్యం ప్రయాణికులు ఈ రోడ్డు పై నరకయాతన పడుతున్నారు. మాడ్గుల మండలం నల్లవారిపల్లి గ్రామానికి బీటీరోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. అవురుపల్లినుంచి నల్లవారిపల్లి మీదుగా చంద్రాయణపల్లి వరకు బీటీరోడ్డు నిర్మించి రవాణా సౌకర్యం కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు ప్రజాప్రథినిధులు, అధికారులను కోరుతున్నారు. ఐదు కిలోమీటర్ల ఈ రోడ్డును పీఎం జీఎ్‌సవైలో బీటీ రోడ్డు నిర్మాణానికి అధికారులు ప్రతిపాధించారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ కూడా ఈ రోడ్డు బీటీకి తొలి ప్రాధాన్యమిస్తూ నిధుల మంజూరుకు ప్రభుత్వానికి నివేదించారు. గతేడాది ప్రతిపాదనలు పంపినా బీటీ రోడ్లలో చాలావరకు మంజూరైన ఈ రోడ్డు మిగిలి పోయింది. ఇతర ప్రాంతాలకు వెళ్లలంటే నల్లవారిపల్లి గ్రామస్తులు కొన్ని సార్లు విధిలేక అవురుపల్లి, చంద్రాయణపల్లి, పోలెపల్లి గేటుకు వెళ్లాల్సి వస్తుంది. బీటీ రోడ్డు నిర్మాణ విషయంలో ఉన్నతస్థాయి అధికారులు ప్రజాప్రథినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


ఇబ్బందులు పడుతున్నాం

అవురుపల్లి నుంచి నల్లవారిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా పాడైంది. కాలినడకకు సైతం కష్టంగా మారింది. రోడ్డుపై గోతులు ఏర్పడి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. పాడైన రోడ్డుపై చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బీటీ రోడ్డు నిర్మించి ఇబ్బందులు తీర్చాలని రెండు దశాబ్దాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 

- ఇటికాల విక్రమ్‌రెడ్డి, గ్రామనాయకుడు, నల్లవారిపల్లి


త్వరలో బిటీ రోడ్డు 

నల్లవారిపల్లి గ్రామానికి పీఎమ్‌జీఎ్‌సవైలో బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సహకారంతో త్వరలో బీటీ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టాం. ఈ ఏడాది పీఎంజీఎ్‌సవైలో ప్రతిపాధించిన రోడ్లలో నల్లవారిపల్లికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. బీటీ రోడ్డు నిర్మించి ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

- రుద్రాక్ష పార్వతమ్మ, సర్పంచ్‌, నల్లవారిపల్లి



Updated Date - 2022-08-13T05:28:31+05:30 IST