Abn logo
Jan 25 2021 @ 00:33AM

తల్లిని గాయపరచి బంగారం అపహరణ


ఆకివీడు, జనవరి 24: కన్న కొడుకు తల్లిని గాయపర్చి మెడలో ఉన్న బంగారు వస్తువులు లాక్కుని వెళ్ళిపోయాడు. స్పృహ కోల్పోయిన ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఆకివీడు అమృతరావు కాలనీకి చెందిన టి.రంగాదేవి కుమారుడు  లక్ష్మీనరసింహస్వామి తాగుడుకు బానిసయ్యాడని, తల్లిని పలుమార్లు స్థలం, బంగారం వస్తువులు తనకు ఇవ్వాలంటూ రాద్ధాంతం చేసేవాడని, శనివారం మద్యం సేవించి తల్లిని గాయపరచి మెడలో ఉన్న బంగారం వస్తువులు తీసుకు వెళ్లాడన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement