‘బీస్ట్’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది : పూజా హెగ్డే

తమిళ దళపతి విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న తమిళ చిత్రం ‘బీస్ట్’. ‘కోలమావు కోకిల, డాక్టర్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. ఓ షాపింగ్ మాల్ నేపథ్యంలో కిడ్నాపింగ్ థ్రిల్లర్ గా ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో చిత్రీకరణ 100రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘బీస్ట్’ చిత్ర బృందంతో పూజా హెగ్డే దిగిన ఫోటోను తన ఇన్ స్టా ఖాతా ద్వారా షేర్ చేశారు. 


‘బీస్ట్ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో మళ్ళీ నేను కలిశాను. వారితో కలిసి పనిచేస్తుంటే చాలా సరదాగా అనిపిస్తోంది. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాది పొంగల్ కి విడుదలవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు’ అని వివరించారు పూజా.  ‘మాస్టర్’ తర్వాత విజయ్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 


Advertisement