బియాంత్ సింగ్ హత్య కేసు.. రాజోనాకు క్షమాభిక్షపై కేంద్రానికి గడువు ఇచ్చిన సుప్రీం

ABN , First Publish Date - 2022-05-02T21:29:57+05:30 IST

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన..

బియాంత్ సింగ్ హత్య కేసు.. రాజోనాకు క్షమాభిక్షపై కేంద్రానికి గడువు ఇచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అభ్యర్థనపై రెండు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారంనాడు ఆదేశించింది. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌ సారథ్యంలోని ధర్మాసనం సోమవారంనాడు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దాదాపు 26 ఏళ్లుగా జైలులో ఉన్నందున తనకు విధించిన శిక్షను తగ్గించాలని, ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని రాజోనా సుప్రీంకోర్టులో క్షమాభిక్ష పిటిషన్ వేశారు.


సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ 1995 ఆగస్టు 31న చండీగఢ్ సచివాలయం ముందు జరిగిన పేలుడులో బియాంత్ సింగ్‌తో పాటు మరో 16 మంది మరణించాడు. ఈ పేలుడులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్ సింగ్ రాజోనా ప్రమేయమున్న్టటు ఆధారాలు ఉండటంతో ప్రత్యేక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. గత 26 ఏళ్లుగా ఆయన జైలుశిక్ష అనుభవిస్తుండగా, 2012 నుంచి ఆయన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉంది.

Updated Date - 2022-05-02T21:29:57+05:30 IST