బీన్స్‌ ఫూగత్‌ (గోవా స్టయిల్‌)

ABN , First Publish Date - 2021-07-29T18:51:36+05:30 IST

బీన్స్‌- పావు కిలో, ఉల్లి- ఒకటి, పచ్చి మిర్చి- రెండు, పోపు గింజలు- స్పూను, కరివేపాకు- రెండు రెబ్బలు, ఎండు మిర్చి- రెండు,

బీన్స్‌ ఫూగత్‌ (గోవా స్టయిల్‌)

కావలసిన పదార్థాలు: బీన్స్‌- పావు కిలో, ఉల్లి- ఒకటి, పచ్చి మిర్చి- రెండు, పోపు గింజలు- స్పూను, కరివేపాకు- రెండు రెబ్బలు, ఎండు మిర్చి- రెండు, పచ్చి కొబ్బరి- అర కప్పు, చక్కెర- రవ్వంత, ఉప్పు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: బీన్స్‌ను కడిగి అర ఇంచు పొడవున కట్‌ చేసుకోవాలి.  మందపాటి పాన్‌లో నూనె వేయాలి. అందులో పోపు గింజలు వేగాక మిర్చిని కూడా కలిపి వేయించాలి. రెండు నిమిషాల తరవాత ఉల్లిముక్కల్ని వేసి దోరగా వేగాక బీన్స్‌ ముక్కలు, ఉప్పు, చక్కెర కలపాలి. తర్వాత పావు కప్పు నీళ్లు కూడా పోసి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి. దీనికి పచ్చి కొబ్బరి కలిపితే బీన్స్‌ ఫూగత్‌ సిద్ధం. వేడి వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2021-07-29T18:51:36+05:30 IST