Abn logo
Sep 23 2021 @ 10:09AM

కోవలం, ఈడెన్ బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్!

న్యూఢిల్లీ: దేశంలోని మరో రెండు బీచ్‌లకు 'బ్లూ ఫ్లాగ్' సర్టిఫికేషన్ అందింది. ఫలితంగా దేశంలో ‘బ్లూ ఫ్లాగ్‌’ గుర్తింపు పొందిన బీచ్‌ల సంఖ్య పదికి చేరుకుంది. ఈ విషయాన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమిళనాడులోని 'కోవలం', పుదుచ్చేరిలోని 'ఈడెన్' బీచ్‌లకు ఇంటర్నేషనల్ ఎకో ఫ్రెండ్లీ గుర్తింపు అయిన బ్లూ ఫ్లాగ్‌ ట్యాగ్ లభించింది. 

బ్లూ ఫ్లాగ్ అవార్డులను అత్యుత్తమ బీచ్‌లకు అందిస్తారు. బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్ గుర్తింపు పొందాలంటే ఆయా బీచ్‌లు చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే సందర్శకులకు మెరుగైన సేవలను అందించే ఏర్పాట్లు కూడా ఉండాలి.  టూరిస్టులకు భద్రత కల్పించాలి. ఇటువంటి ప్రమాణాలు కలిగిన బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్‌ అనే గౌరవం దక్కుతుంది. డెన్మార్క్‌కు చెందిన పర్యావరణ అవగాహన సంస్థ ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌(ఎఫ్ఈఈ) అత్యుత్తమ బీచ్ లను బ్లూ ఫ్లాగ్ పేరిట  సత్కరిస్తుంటుంది. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...