సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-06-06T09:39:49+05:30 IST

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలు సీజనల్‌ వ్యాఽధలతో అప్రమత్తంగా

సీజనల్‌ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి

జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి  

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే పల్లెల అభివృద్ధి     

ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌    

కొనసాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు


కొందుర్గు/చౌదరిగూడ్గ/షాద్‌నగర్‌/షాద్‌నగర్‌రూరల్‌: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలు సీజనల్‌ వ్యాఽధలతో అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని రేగడి చిల్కమర్రి, ముట్పుర్‌ గ్రామాల్లో ఆమె ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు సీజనల్‌ వ్యాఽధల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు.


గ్రామానికి కొందరు తమకు పింఛన్లు మంజూరు చేయాలని రేగడిచిల్కమర్రి గ్రామస్థులు కోరారు. అర్హత ఉన్న వారికి ఫించన్లు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. సమస్యలపై సమావేశంలో చర్చించి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రెండు గ్రామాల్లో జడ్పీ చైర్‌ పర్సన్‌, ఎమ్మెల్యే మొక్కలను నాటారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మెన్‌ గణేష్‌, జడ్పీటీసీ రాగమ్మ, మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రామకృష్ణరెడ్డి, ఎంపీపీ జంగయ్య, వైస్‌ ఎంపీపీ రాజేష్‌పటేల్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీ రాంరెడ్డి, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు. చౌదరిగూడ  మండల పరిధిలోని తుమ్మలపల్లి, లచ్చంపేట గ్రామాల్లో శుక్రవారం జడ్పీ చైర్మన్‌ అనితారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పర్యటించారు.


లచ్చంపేట గ్రామంలోని నర్సరీని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే తుమ్మలపల్లి గ్రామంలోని ప్రతి వీధి తిరిగి పచ్చదనం పరిశుభ్రతను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మెన్‌ గణేష్‌, జడ్పీటీసీ స్వరూప, ఎంపీటీసీ రజిత, సర్పంచ్‌ పాల్గొన్నారు. పట్టణాన్ని ప్రతిఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని  మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌ అన్నారు. పట్టణప్రగతిలో భాగంగా శుక్రవారం 4, 12, 23, 26వ వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో కౌన్సిలర్లు వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్‌, విశాల, మునిసిపల్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎంపీపీ ఖాజాఇద్రీస్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి తెలిపారు. పల్లెప్రగతిలో భాగంగా శుక్రవారం ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట, మొగిలిగిద్దలో కొనసాగుతోన్న పారిశుధ్య పనులను వారు శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు సాయిప్రసాద్‌ యాదవ్‌, లలిత, ఎంపీడీవో శరత్‌చంద్రబాబు పాల్గొన్నారు.


పల్లెప్రగతి గ్రామాల అభివృద్ధికి దోహదం 

ఆమనగల్లు/కడ్తాల: పల్లెప్రగతి కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి దోహద పడుతోందని ఎంపీపీ అనితవిజయ్‌ అన్నారు. మండల పరిధిలోని ఆకుతోటపల్లిలో సర్పంచ్‌ రజితశ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో వెంకట్రాములు, ఎంపీవో ఉమారాణితో కలిసి పారిశుధ్య కార్యక్రమాలు, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు నిర్మాణం పనులను పరిశీలించారు. కడ్తాల మండలం అన్మాస్‌పల్లి, గాన్గుమర్ల తండాల్లో ప్రత్యేకాధికారి రత్నకల్యాణి పర్యటించి పల్లెప్రగతిలో భాగంగా పలు అభివృద్ది పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనురాద, ఎంపీవో తేజ్‌సింగ్‌, సర్పంచ్‌ శంకర్‌, ఉప సర్పంచ్‌ అనిల్‌, ఏపీఓ తిరుపతాచారి, తదితరులు పాల్గొన్నారు.


పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

గ్రామాల్లో పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలువురు సర్పంచ్‌లు తెలిపారు. పల్లెప్రగతిలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని చేవెళ్ల, దామరిగిద్ద, ముడిమ్యాల్‌ గ్రామాల్లో సర్పంచ్‌లు వెంకటేశంగుప్తా, శైలజారెడ్డి, శేరి స్వర్ణలత గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయడంతో పాటు మొక్కలను నాటించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామల పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థులు పాల్గొన్నారు.


పల్లెప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలి

పల్లెప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని ఎండీవో జి.క్రిష్ణకుమారి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గుమ్మడవెళ్లిలో కొనసాగుతున్న పారిశుధ్య పనులను ఆమె పర్యవేక్షించారు.  


టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలోనే పల్లెల అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలోనే పల్లెలు అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ అన్నారు. పట్టణ ప్రగతిలో  భాగంగా శుక్రవారం మండల పరిధిలోని నర్కూడ, సుల్తాన్‌ పల్లిలో ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్‌, జడ్పీటీసీ తన్వీరాజు, సర్పంచ్‌లు ఇస్తారి, సిద్దులుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామాల రూపురేఖలు మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఎస్‌సీఎస్‌ చైర్మన్‌ సతీష్‌, గణేష్‌గుప్తా, ఎంపీటీసీలు సంగీతసిద్దేశ్వర్‌ పాల్గొన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంతోనే మునిసిపాలిటీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతోందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి అన్నారు. 23వ వార్డు కౌన్సిలర్‌ స్రవంతిశ్రీకాంత్‌రెడ్డితో కలసి పట్టణప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ స్రవంతి శ్రీకాంత్‌రెడ్డి, చంద్రశేఖర్‌, ప్రసాద్‌, పవన్‌గౌడ్‌, బంటీ, జయేందర్‌ తదితరులు పాల్గొన్నారు.


పరిసరాల పరిశుభ్రతే లక్ష్యం

పరిసరాల పరిశుభ్రతే లక్ష్యమని మున్సిపాలిటీల చైర్మన్లు, కమిషనర్లు అన్నారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో శుక్రవారం కూడా పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఘట్‌కేసర్‌లోని 12వ, 13వ వార్డుల్లో చైర్‌పర్సన్‌ ముల్లి పావనియాదవ్‌,  కౌన్సిలర్లతో కలిసి పర్యటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలుచోట్ల పాలకవర్గ సభ్యులు మొక్కలు నాటారు. కార్యక్రమాల్లో వైస్‌చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, కమిషనర్‌ వసంత, మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపా లిటీల పరిధిలో చైర్మన్లు చంద్రారెడ్డి, ప్రణీత పర్యటించారు. దమ్మాయిగూడ రాజీవ్‌గృహకల్ప కాలనీలో చైర్మన్‌, కమిషనర్‌, కౌన్సిలర్‌ పర్యటించారు. మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలోని చైర్మన్‌ దీపికానర్సింహారెడ్డి, వైస్‌చైర్మన్‌ రమేష్‌, కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి పర్యటించి, అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. హరితహారంపై స్థానికులకు అవగాహన కల్పించారు.

Updated Date - 2020-06-06T09:39:49+05:30 IST